Saturday, 7 November 2015

విరగ్గొట్టారు. 7

'మాంబలం' లోకల్ రైల్ స్టేషన్ వద్ద (టి నగర్ కి వెళ్ళేవారు ఇదే పాయింట్ లో దిగాలి)
ఎక్కువగా ‘ఆంధ్రా మెస్’ లు ఉండేవి.
AMIE. (Associate Member in Institute of Engineering) చదివే పిల్లలు కో కొల్లలు.
..
ఆంధ్రపదేశ్ లో ఇంజనీరింగ్ కాలేజీ లు వేళ్ళ మీద లెక్కించెట్టు ఉంటాయి.
ప్రభుత్వ కాలేజీలు ఇంకా నాలుగయిదు ప్రైవేట్ కాలేజీ లు ఉన్నట్టు గుర్తు....
ఇంజనీరింగ్ విధ్య అంటే అదో అందని పండు.
కానీ తెలివి, సామర్ధ్యం పట్టుదల ఉండి ఇంజనీరింగ్ చదవాలను కునే పిల్లలకి AMIE మరో మంచి ఆప్షన్.
కొద్ది మండి CA కూడా చదువుతుండేవారు. AMIE కి చాలా ప్రవేటు కాలేజీ లు ఉండేవి. .
..
వందలాది మంది ఆంధ్రా పిల్లలు అక్కడ్ ఇండ్లు అద్దెకు తీసుకుని మెస్ లలో తింటూ చదువుకునే వారు.
అక్కడ స్టూడెంట్స్ కి ‘ఆంధ్రా మెస్’ లో ముపై మిల్స్ టోకెన్ టిక్కెట్ల ధర రూ 150-00 గా ఉండేది.
అంటే.. ఒక పూట.. బోజనం అయిదు రూపాయలు ..
..
శాంతి వెళ్ళి పోయాక మరెప్పుడూ నేను 1-50 పాకెట్ల వైపు వెళ్లలేదు .
తరచూ గుండె తడి చేసుకోవటం ఇష్టం లేక.
..
మధ్యాన్నం నేను ఆంధ్రా మెస్ లో తినటం మొదలెట్టాను. ..
మా కొలీగ్ సైకిలు వేసుకుని రెండు కి మీ పైగా ఉండే మెస్ కి వెళ్ళి; వీలయినంత ఎక్కువ తినేవాడిని.
మర్నాడు మధ్యాన్నం వరకు అదే బోజనం.
**
ఒక రోజు మద్రాస్ లో ఎందుకో గుర్తు లేదు కానీ సంపూర్ణంగా ‘బంద్’ జరిగింది.
ఆ రోజు మెస్ లేదు, దుకాణాలు, హోటల్స్ మూసేశారు. నేను రోజు లాగే సైకిలు తొక్కుకుని వెళ్ళి మెస్ క్లోజ్ చేసి ఉండటం చూసి వెనక్కి వచ్చాను. బాగా ఎండగా ఉంది.
మంచి నీళ్ళు తాగి పని చేసుకుంటున్నాను . కొద్ది సేపటి తర్వాత తల నొప్పి మొదలయింది.
కళ్ళు తిరుగుతున్నాయి. కారణం అర్ధమవుతూనే ఉంది. ఆకలి
కడుపులో ఉండలు ఉండలు గా బాద.
..
బాజారు కెళ్ళాను. ఏదయినా దొరుకుతుందేమోనని చూశాను.
ఒక చోట రెండు అరటి పళ్ళు కొనుక్కున్నాను.
తిన్నాక కొంత ఉపశమనం కలిగింది.
***
..
ఆ రాత్రి నా జీవితం లో ఒక అత్యంత దురదృష్టకరమయిన సంఘటన జరిగింది...
దరిద్రుడికి ఆకలి పెచ్చు అన్నట్లు ....
..
నేను రోజు మాదిరిగానే సాయంత్రం పాండి బజారు వెళ్తుంటే ..
హింది ప్రచార సభ రోడ్డు లో ఒక రిసెప్షన్ జరుగుతుంది.
..
కలవారి రిసెప్షన్. రంగు రంగుల దీపాలు,
మ్యూజికల్ నైట్ లో మహమ్మద్ రఫీ పాటలు పెద్దగా వినబడుతున్నాయి...
..
ఒక బట్ట తల అబ్బాయి కళ్ల జోడు పెట్టుకుని , .
గుమ్మడిపండు లాటి పిల్ల పక్కనఉన్నారు . అతిదూలందరి వద్ద అభినందనలు అందుకుంటూ ఉన్నారు,
..
వచ్చిన వారు జంటలుగా బహుమతులు ఇచ్చి పక్కన నిలబడి ఫోటోలు తీయించు కుంటున్నారు.
పెద్ద పెద్ద వీడియొ కేమేరాలతో షూటింగు చేస్తున్నారు...
ఆమోల్ పాలేకర్ “ చిత్ చోర్” సినిమా నుండి ‘గోరి తేరా గావు బడా ప్యారా.. పాట మొదలయింది.
...
ఇవన్నీ కాదు నన్ను ఆక్కడ ఆకర్షించినవి.
డైనింగ్ హాలు మరియు ... భో ..జ ...నా ....లు ...
****
" ఆ క లి "
ఆకలి ఎంతటివాడిని కూడా కుంగ.దీస్తుంది.
నేను వెళ్ళాను వరుసలో కూర్చున్నాను.
పోదుమ్ .. వేండా, వెణుం .. (చాలు .. వద్దు .. కావాలి) అమ్ముల పొదిలి సిద్దంగా ఉన్నాయి
టేబుల్ మీద కాగితం పరిచారు (అంతకు మునుపు తెలీదు )
పెద్ద విస్తరి, మంచి నీటి గ్లాసు. అందులో చల్లటి నీళ్ళు..
ఇక ఐటం లు వరసగా.. రావటం మొదలయ్యింది. యూనిఫార్మ్ వేసుకున్న కుర్రాళ్ళు నైపుణ్యంగా వడ్డించడం మొదలెట్టారు.
బిర్యానీ,
చపాతీ,
మష్రూమ్ కూర ,
ఏవేవో స్వీట్లు
హాట్లు ..
అబ్బా నన్ను డిస్టబ్ చెయ్యొద్దు. ..
వేండా తో పని లేదు , పోదుమ్ తో అవసరం రాలేదు..
వేణూం .. వేణూం.. ఓన్లీ వేణూం ..
చల్లటి ఐస్ క్రీమ్ తో .......బ్రేవ్
***
డైనింగ్ ..రూము నుండి బయటకి వస్తుంటే ఎవరో చొక్కా కాలరు వద్ద పట్టుకున్నారు.
వంటగది లో బియ్యపు బస్తాల మీద ఉన్నాను నేను.
దేనితో కొట్టారో గుర్తు లేదు.
విరగ్గొట్టారు.
..
నా జేబులు వెతికారు.
ఒక పది రూపాయల నోటు ఉన్న పర్సు ఉంది. చేతికి hmt వాచీ ఉంది.
నాకు అర్ధం అయింది...
..
' అయాం నాట్ ఆ తీఫ్ .. హంగ్రి .. జస్ట్ కేం ఇన్ ఫర్ మిల్స్ .. పెద్దగా ఏడుస్తూ చెప్పాను.
..
కొట్టే తమిళ తంబిలలో ఎవరో ఆగి అర్ధం కానీ తమిళం లానికి ఇంగ్లీష్ కలిపి
“ఎక్కడ ఉంటావు?” అని అడిగారు...
..
నేను చెప్పదలుచు కోలేదు...
..
వాచీ లాక్కుని నన్ను బయటకి గెంటారు. ..
టెన్త్ లో స్కూల్ ఫస్ట్ వచ్చినపుడు నాన్న, 250 రూపాయల తో కొనిచ్చిన అత్యంత విలువయిన చేతి గడియారం అది.
....
‪#‎33grade‬

No comments: