Tuesday, 17 November 2015

గుస... గుస .. గుస -20

ఎవరికయినా ఎదగడానికి పనికివచ్చేంత అసంతృప్తి, ఆనందంగా ఉండటానికి సరిపడే తృప్తి అవసరం.
ఇవి సరైన పాళ్లలో ఉన్నపుడే బి పి లు షుగర్ లు కొంత దూరంగా ఉంటాయి.
అసంతృపి ని గెలిపించి శుక్రవారం ఇంటర్వ్యూ కి వెళ్ళటానికి నిర్ణయించుకున్నాను.
మూడు బస్సులు మారి శరవణా కంస్ట్రక్షన్ ఆఫీసుకి వెళ్ళే సరికి చప్పగా తడిచి పోయాను. బెంగుళూరు వాతా వరణం తమాషాగా ఉంటుంది. పెటెల్మని ఎండ కాస్తుంటుందా, బస్సు ఎక్కి మరో పాయింట్ లో దిగే సరికి జోరున వర్షం కురుస్తుంటుంది. అంత గొప్ప వాతావరణం ఉన్న మరో కాస్మోపాలిటన్ సిటిని చూడటం కష్టం. సిటీ ఆఫ్ గార్డెన్ గా పిలవబడే బెంగుళూరు లో చెట్లకి అత్యంత ప్రాదాన్యత ఇస్తారు.
నేను వెళ్ళే సరికి నలబై మంది దాకా అభ్యర్డులు వచ్చి ఉన్నారు. వారికి 8 మంది సైట్ ఇంజనీర్ల  అవసరం ఉంది. వచ్చిన వాళ్ళలో తమిళ, కన్నడిగులే ఎక్కువ, ఇద్దరు మలయాళీలు, ఒకే ఒక్క తెలుగు అబ్యర్ధిని నేను.
హైదరాబాదు సైట్ ఇంచార్జ్ “దొడ్డప్ప” గారు ఇంటర్వ్యూ చేస్తారని గుస గుస . తీరా ఆయనోచ్చేసరికి రెండున్నర అయింది. మధ్యాన్నం మాకు వర్కింగ్ లంచ్ ఏర్పాటు చేశారు. వచ్చాక కూడా హడావిడిగా ఉన్నారు ఏదో అత్యవసరంగా ఫ్లైట్ లో మద్రాసు వెళ్ళే హడావిడిలో ఉన్నారు. ( గుస గుస : ఫేర్ 850 రూపాయలు ట ) వచ్చి రాగానే అందరినీ ఒక గదిలో కి పిలిచారు.
మెడకి ఒక నెక్ కాప్ పెట్టుకుని పాత సినిమాలో ప్రభాకర రెడ్డి గారిలాగా ఉన్నారు. దొడ్డప్ప గారు. కన్నడ ఇంగ్లీష్ లో చెప్పసాగాడు. “ అనుకోని పని వత్తిడి వల్ల లేటుగా వచ్చి నందుకు సారి. వెంటనే వెళ్లిపోవాల్సి వచ్చినందుకు మళ్ళీ సారి .

మీ అందరికీ ఒక ప్రశ్నా పత్రం ఇస్తారు. సమాదానాలు రాసి మీ రెజ్యూమ్ తో బాటు ఆఫీసులో ఇచ్చేయండి. సరిగ్గా వారం తర్వాత నెక్స్ట్ శుక్రవారం మేం సెలెక్ట్ చేసుకున్న వాళ్ళ పేర్లు లిస్ట్ ఇక్కడ అంటిస్తాము. సెలెక్ట్ చేసిన తర్వాత 10 రోజుల్లో  హైదరా బాదు వెళ్లాల్సి ఉంటుంది. హైదరాబాదు కి దూరంగా పహడి శరీఫ్ అనే గ్రామ పొలిమెరల్లో నిర్మాణం లో ఉన్న (Research Center Imarat (RCI) Hyderabad) ప్రాజెక్ట్ లో మా కంపెనీ చేపట్టే  సివిల్ వర్క్ లో పని చేయాల్సి ఉంటుంది. ప్రారంభ జీతం 750 నెలకి. బోజనమ్  వసతి & క్వార్టర్స్ ఉంటాయి. సండే వర్కింగ్ కి 50 రూపాయల్లు బోనస్, సర్వీస్ మైడ్, ప్రతి ఆదివారం సిటీ విజిట్ కి కంపెనీ జీపు లాటి సౌకర్యాలు అదనం.  ఆఫీసు ఫోన్ నెంబరుకి ఫోన్ చేసి అయినా వివరాలు కనుక్కోవచ్చు. దన్యవాదాలు. మరియు శుభాకాంక్షలు “

రూములో కి వచ్చినంత వేగంగా వెళ్ళి పోయాడు.
మళ్ళీ పరీక్షా .. ఓరి దేవుడా? అందరూ మళ్ళీ గుస.. గుస
***
ప్రశ్నా పత్రం లో పెద్ద కంగారు పడాల్సినవి ఏమి లేవు.
అబ్యర్ది వివరాలు, నివాసం, చిరునామా, గత ఉద్యోగ వివరాలు, అనుభవం, చదువు వివరాలు ఒక బాగం.
రెండు ప్రశ్నలు మరో బాగం.
1.           డంపీ లెవల్ సర్వే చేసే వ్యక్తికి ఒక చెరువు  అడ్డం వచ్చింది. ఫోకస్ కి అందని అంతదూరం లో తీరం ఉంది. ఇటునుండి అటు వైపుకు బెంచ్ మార్కు ని ఎలా బదిలీ చేస్తావు ? (surveying ability)


2.          వరుస నెంబర్లు వేసిన డ్రమ్ లలో 15 గ్రాములు బరువు ఉన్న బొల్ట్స్ ఉన్నాయి. ఒకదానిలో మాత్రం 14 గ్రాములవి ఉన్నాయి. ఒక ఎలెక్ట్రానిక్ డిజిటల్ స్కేలు ని  ఎన్ని  తక్కువ సార్లు వాడి  14 గ్రాముల బొల్ట్స్ ఉన్న డ్రమ్ ని కనుక్కోవచ్చు. (logical application ability

చివరి రెండు ప్రశ్నలకి మా ముఖాన నెత్తురు చుక్క లేదు. 
మళ్ళీ గుస.. గుస.. గుస.. గుసNo comments: