Saturday, 14 November 2015

కంపార్ట్మెంటలైజషన్ -15

“ఏ ఊరు ?” వెంకట్రావు గారు పలకరిస్తూ కూర్చోమన్నట్టు సైగ చేశారు.
నేను నా బాగ్ లు రెండు ఒక వైపు ఉంచి.
“ఒంగోలు సార్ . నాన్న గారు టీచరు . నేను అక్కా ఇద్దరం పిల్లలం, అమ్మ మిషను కుడుతుంది. నాన్న రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నారు. రీసెంట్ గా డిప్లొమో చేశాను 83% తో ..” వీలయినంత వివరంగా చెప్పాను.
ఆయన తక్కువగా అయినా మనసుతో మాట్లాడటం గమనించాను.
మనలో చాలా మందిమి రెండు సంభాషణలు చేస్తూ ఉంటాం. 
మాటల ద్వారా ఒకటి, మనసు ద్వారా మరోది.
“చాలా కాలం అయిందే. బొత్తిగా కనిపించడం మానేశావు “ అని బయటకి .
“ అయిదువందలు తీసుకుని తిరిగి ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నావ్” అని లోపల ఇలాటివి ఉదాహరణ
..
వెంకట్రావు ఏమి అంటారో అదే ఆయన మనసులోను ఉండటం గమనించాను...
గూడూరు లో కుటుంబం ఉంటుందని తను నెలకో సారి వెళ్ళి వస్తుంటానని చెప్పాడు.
కొద్ది సేపు మాట్లాడాకా నాకు అతని మనస్తత్వం బోద పడింది.
..
నేను ఒక చిన్న నాప రాళ్ళ అరమారలో కాగితాలు పరిచి బట్టలు పుస్తకాలు, సర్దుకున్నాను. ..
..
కంస్ట్రక్షన్ టైం మేనేజ్మెంట్ లో ఆయన నిపుణుడు...
..
పదిరోజుల తర్వాత ఎమెటీయల్ అవసరమో ఏది షార్ట్ అవుతుందో. ..
దానివల్ల ఎంతమంది వర్కర్స్ కు పని ఉండదో ఆయన కరెక్టు గా ఊహిస్తాడు.
సైట్ లో తెలుగు,తమిళ , కన్నడ, ఉర్దు మాట్లాడే వారు పని చేసేవారు.
దాదాపు అందరికీ ఎంతో కొంత అన్నీ భాషలలోనూ ప్రావీణ్యం ఉండేది.
తిరిగి చెప్పలేక పోయినా ఏ భాషలో చెప్పినా అర్ధం చేసుకోగల నైపుణ్యం అందరి సొంతం.
..
ఒక ఆడ కూలీ ప్రత్యేకంగా మాకోసం రూము శుభ్రం చేసి అన్నం వండటం, సాంబారు చేయటం, మా బట్టలు ఉతకటం చేసేది. కంపెనీ ఖర్చు తో బోజన యేర్పాట్లు జరిగి పోయేయి. ..
ఇక తిండి గురించి ఆలోచించే అవసరం రాలేదు.
..
మోకాళ్ళకి రెండు ‘నీ కాప్’ లు తగిలించుకుని ఆయన రోజులో అనేక సార్లు ..
ఎనిమిది అంతస్తులు చక చకా ఎక్కి దిగేవారు.
ఇద్దరు కూలీలు నిరంతరం మేక తోలు సంచి ని బుజాన తగిలించుకుని దానిలో నీళ్ళు మగ్గుల..లో నింపుకుని గోడలు క్యూరింగ్ చేసేవారు.
..
ప్రతి రోజు ఆడ, మగ కూలీలు (ఆంబలాలు, పొంబలాలు) హాజరు నుండి రోజు వారి వివిద చిన్న మేస్త్రీల వర్క్ నమోదు చేసు కోవటం. సైట్ లో ఉన్న డ్రాయింగ్ లు ప్రకారం పని చేయించడం. మిలటరీ గేరీజన్ ఇంజనీరు పరిశీలనకి వచ్చి నపుడు వారి సూచనల ప్రకారం పనులు చేయించడం, ప్రతి శని వారం వర్కర్స్ కి చేసిన పనికి ఒప్పందపు యూనిట్టూ విలువ ప్రకారం డబ్బు ..చెల్లింపు వోచర్ లు తయారు చేయడం అవి నా విదులు. ..
ఎందుకో గాని వెంకట్రావు గారికి మానేజ్మెంట్ మీద చాలా అసంతృప్తి ఉండేది.
కానీ గొప్పతనం ఏమిటంటే దానిని ఆయన తన పని లో ఎప్పుడూ చూయించే వాడు కాదు.
..
మానవ అనుభూతులని కంపార్ట్మెంటలైజ్ చేసుకోవాలనే థియరీ ని ..
మొదటిసారి ఆయన నుండే నేను నేర్చుకున్నాను.
ఒక ఫీలింగ్ తాలూకు అసంతృప్తి ని మరో పనికి బదలాయించకూడదని ఆయన చెప్పేవాడు.
..
అలాటి అబ్యాసం చేయకపోవటం వలనే స్త్రీ లు ఎక్కువ ఆలోచించి వర్తమానాన్ని నరకం చేస్తారు అనేవాడు . అప్పట్లో నాకు అర్ధం అవక పోయినా ఆయన ఆచరణ చూసి కొంత అవగాహన చేసుకున్నాను...
‪#‎33grade‬

No comments: