Sunday, 15 November 2015

అయాం కాన్ఫిడెంట్ -17

మా కంపెనీ కి, ఫండ్స్ రిలీజ్ చేసే మిలటరీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కి వారది లాటి గేరీజన్ ఇంజనీరు లతో నా అప్రోచ్ చక్కగా ఉండేది. కొంత అమాయకత్వం తో కూడిన సబ్మిసివ్ నెస్ వాళ్ళు బాగా ఇష్ట పడేవారు . స్టేజ్ వైజ్ వర్క్ డన్ బిల్లులు, కాంట్రాక్ట్ సర్టిఫికేట్ తో కలసి నేనే సబ్మిట్ చెయ్యటం మొదలెట్టాను. చిన్న చిన్న లోపాలు ఉన్నా లౌక్యంగా బిల్ పాస్ చేయిస్తుండే వాడిని. కేవలం ఆ కారణంగానే ఫినిషింగ్ స్థాయి లో ఉండి చాలా పేమెంట్ రావాల్సి ఉన్న మరో సైట్ కి నన్ను బదిలీ చేశారు. ఆక్టాగ్నల్ షేప్ లో ఉన్న కాన్ఫరెన్స్  హాల్ అది. డోమ్ రూఫ్ తో విశాలంగా ఉంటుంది. అక్కడ అప్పటి వరకు ఇంచార్జ్ గా ఉన్న భాస్కర  రాజు గారి ప్లేస్ లో నన్ను ఉంచారు.
ప్రవేట్ సంస్థల్లో పొమ్మని అనరు గాని పొగబెట్టటం మాత్రం మానరు. ఆయనకి పొగ బెట్టటం ప్రారంభించారు. దగ్గరలోని ఔట్ స్కర్ట్స్ లో ఉండేవాడు ఆయన వృద్దాప్యానికి దగ్గరగా ఉండేవాడు. రోజు సైకిల్ మీద సైట్ కి వచ్చేవాడు. వస్తూ  ఒక బాక్స్ లో ఇంటి బోజనమ్ తెచ్చుకునేవాడు. నేను కంపెనీ ఆకవుంటు నుండి పెర్క్స్ (చిల్లర ఖర్చులు ) డ్రా చేసుకునే స్టాయికి ఎదిగాను. కంపైని పెట్రోల్ తో ఒక టి‌వి‌ఎస్ 50 వాడుకునే వాడిని. సాయంత్రానికి రెండు కిలోమీటర్ల దూరం లో ఉండే మా వెంకట్రావు సార్ వద్దకి వస్తుండేవాడిని. నేను ఇంచార్జ్ గా ఉన్న సైట్ కి దగ్గర ఒక తగ్గింపు ధరలతో  మిల్టరీ కాంటీన్  ఉండేది. లంచ్ సాదారణంగా అక్కడే చేస్తూండే వాడిని.
భాస్కర రాజు ఒక విచిత్రమయిన పర్సనాలిటీ. మేధావి. పిరమడాలజీ మొదలుకొని అనేక విషయాల మీద అవగాహన ఉండేది. వయసులో చాలా చిన్న ఆవిడను పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని. చిన్న పిల్లవాడు ఉన్నాడని చెప్పాడు.
పిరమిడ్స్ గురించి అనేక విషయాలు చెప్పేవాడు. ఒక పిరమిడ్ ని గట్టిగా తోసేట్టుగా భుజం వద్ద వత్తిడితో ఆనుకుని రెండు నిమిషాలు నెట్టి ఆగాక వదిలేస్తే చెయ్యే దాని అంతట అదే పైకి లేవటం లాటివి చేసి చూపించేవాడు.
మొదటి సారిగా నేషనల్ జాగ్రఫీ పత్రికని దానిపై అతికించిన వరల్డ్ ఫస్ట్ హలోగ్రామ్ ని (ఒక గద్ద బొమ్మ ) అతడి వద్ద చూశాను. రక రకాల పజిల్స్ తో సంభ్రమాశ్చర్యాలకి  గురి చేసేవాడు. అయితే ఇదంతా ఒక కోణం.
కటిక బీదరికం లో ఉండే వాడు. అతని ఇబ్బందులు చూడలేక  నేను 300 రూపాయల  దాకా సర్ది ఉన్నాను.
 ఒకే ఒక సారి నేను అతడితో విబేదించాను.
“ఇంట్లో అన్నం వండలేదు.ఈపూటకి తల్లి పిల్లలని హిప్నటైజ్  చేసి ఆకలి లేకుడా చేసి వచ్చాను  అన్నాడు” ఒకసారి నాతో..
నేను కోపం కట్టలు తెంచుకుంది. వయోబేదాలు పక్కన పెట్టి.
 “మీ ఆవిడ ఏం చదివారు. వయసు ఎంత  ?” అడిగాను.
 “ ముప్పయి దాకా ఉంటాయి. ఇంటర్ చదివింది”
“మిరిన్నాళ్లు అన్నం తింటున్నారా? గడ్డా? సమాజం నుండి సానుభూతి కోరుకుంటున్నారా? ఏం పని చేసుకుని బతక కూడదు. మన దగ్గర రోజు ఆరు గంటలు పనిచేసే కూలీలకు 20 రూపాయలు చెల్లిస్తున్నాం . అదేమయినా తప్పు పనా? మా నాన్న టీచరు. నెలకు 1800 జీతం. అక్క పెళ్ళికి చేసిన అప్పులు ఉన్నాయి. నాన్న జీతం వాటికి సరిపోతుంది. మా అమ్మ మిషను కుడుతుంది. రైతుల ఇళ్ళలో పొలం పనికి వెళుతుంది, మేము యాడాది కి సరిపడే జపాన్ తుమ్మ చెట్లు వంట చెరుకు కోసం సమ్మర్ లో కొట్టి పోగు చేసి పెట్టుకుంటాము. ఉన్నదాంట్లో ఎలా బతకాలో నాన్న, కష్టపడే మనస్తత్వాన్ని అమ్మా నేర్పారు. ఇంత కంటే ఏ తల్లి తండ్రులయినా బిడ్డలకి ఇంకేం ఇవ్వాలి  ? అపారమయిన తెలివితేటలు మీకు ఉన్నాయి, కూడు పెట్టని తెలివి తేటలు తగలెట్టటానికా? Please don’t talk this rubbish to me ” నేను అరుస్తూ చెప్పాను ఎందుకంత ఉద్రేకంగా మాట్లాడానో తెలీదు. మర్నాడు నుండి అతను రాలేదు. పది రోజుల తర్వాత నా దగ్గరకి వచ్చి 300 ఇవ్వబోయాడు.
నేను మనస్ఫూర్తిగా క్షమాపనలు అడిగి డబ్బు తో ఏమయినా కొనుక్కోండి. దానికి మించిన ఆత్మ విశ్వాసం నావద్ద నిండుగా ఉంది . All the best and sorry for everything” చెప్పాను .

అదే అతన్ని చివరిసారి చూడటం.
అక్క నుండి ఉత్తరం వచ్చింది. నేను ఊహించని విషయాలతో ...No comments: