Friday, 6 November 2015

సుశ్రీ నువ్వే కదా? 4

నేను బెరుగ్గా హాల్లోకిఏ వెళ్ళేటప్పటికి మా బాస్ సోఫాలో కూర్చుని,
హిందూ పేపర్ చూస్తున్నారు.
గదిలో ఒక మూల బుష్ కలర్ టి వి ఉంది.
టీవి స్టాండ్ కింద ఆకాయ్ వి‌సి‌పి లోంచి టామ్ అండ్ జెర్రీ ప్రోగ్రామే చూస్తూ
ఒక పాతికేళ్ళ యువతి కూర్చుని ఉంది. 
నేను అత్యంత నిశబ్దం గా లోపలికి వచ్చి స్టార్ హోటల్ డోర్ మెన్ లాగా అంతే వినయంగా నిలబడ్డాను.
**
ఆయన నన్ను గమనించి, రీడింగ్ గ్లాస్ ల లోనుండి చూసి ,
అప్పటి దాకా పేపర్ క్రింద ఉన్న పోస్టల్ కవర్లు వైపు చూపించాడు.
**
రెండు మూడు కార్డులు, రెండు ఇంలాండ్ లెటర్స్ , బ్రౌన్ కవర్స్ ఉన్నాయి,
సుంకర శ్రీనివాసరావు,c/o శ్రీనివాస కన్స్ట్రక్షన్ కంపెనీ, 31-xxx , హింది ప్రచార సభా రోడ్, మద్రాస్ -17.
నన్ను కలవర పెట్టింది అందులో ఉన్న బేరర్ కవర్,
ఏదో పత్రిక నుండి తిరిగి వచ్చిన కద,
పోస్టల్ స్టాంపులు అంటించకపోవటం వల్ల బేరర్ కవర్ లో పంపారు. పోస్ట్ మన్ రెట్టింపు డబ్బులు వసూలు చేసి ఇచ్చి ఉంది ఉంటాడు.
**
జడ్గి ముందు నుంచున్న ముద్దాయిలా ఉంది నా పరిస్తితి.
“ఏం చేస్తున్నావు రా? ఇన్ని ఉత్తరాలు వచ్చాయి?”
.
“ఇది మొదలు కాదు. ప్రతి రోజు ఈ పిల్లాడికే ఎక్కువ పోస్ట్ వస్తుందట “
ఆ పాతికేళ్ళ అమ్మాయి టి వి ఆపి హల్లో ఉన్న మెట్లు ఎక్కి పైకి వెళ్తూ అంది..
.
“కదలు రాస్తాను. టైమ్ పాస్ కి “.
..
“ ఇలాటివా? “ కవర్ లోంచి తిరిగిచ్చిన కాగితాలు చూపిస్తూ అడిగాడు .
“ఇవేమయినా కూడు పెడతాయా? జీవితాన్ని నిలబెట్టుకునే పనులు నేర్చుకో బాగు పడతావు . వచ్చేనెలలో ఆవడి లో కొత్త వర్క్ మెదలవుతుంది . నువ్వు ఫీల్డ్ కి పంపుతాను.” ..
ఆయన ఆ పోస్ట్ కవర్లు నావైపు నేట్టారు. తిరిగి పేపర్ లో మునిగి పోయారు.
..
నేను వాటిని తీసుకుని మెట్లు దిగాను...
..
సాయంత్రం నేను తయారయ్యి పానగల్ పార్కు సర్వే కి బయలు దేరబోతుంటే
మళ్ళీ పని మనిషి ఆరవ యాస తెలుగులో
“ రెడ్డి గారి చిన్నమ్మాయి సాయంత్రం బోజనానికి రమ్మంది “ అంది.
..
ఆమె రెండు మూడు సార్లు చెప్పినప్పటికి నాకు అర్ధం కాలేదు .
ఫ్లాట్ ఫార్మ్ గాడిని, గోప్పింటి బిడ్డ బోజనానికి పిలవటం నాకు భయం వేసింది.
ఇంతలో పై నున్న పోర్తికో నుండి “ ఆరే శీను ఎక్కడికి వెళ్లకు. అపర్ణ నీతో మాట్లాడాలట, ..
ఇవాళ ఇక్కడే తిందువు .” అంది రెడ్డి గారి బార్య.
..
ఆ గంట నా జీవితం లో చాలా సుదీర్గమయినది.
చివరాఖరికి ఆ క్షణాలు రానే వచ్చాయి. ..
..
స్నానం చేసి శుబ్రంగా ఉన్న బట్టలు వేసుకున్నాను. ..
వత్తుగా ఉన్న జుట్టు కి తడి చేసి దువ్వాను. పై నుండి పిలుపు రాగానే తాబేలు లాగా వెళ్ళాను. నేను మా బాస్ ఇల్లు పరిశీలించి చూడటం అదే. నాకు అప్పటి వరకు మూడు నిలువు రూముల ఇల్లు మాత్రమే తెలుసు.
.
డైనింగ్ టేబుల్ మీద కూచో బెట్టి వేడి అన్నం, నేనెప్పుడు తినని కూరలు వేసి కడుపునిండా అన్నం పెట్టింది. ఇంకా వడ్డించ బోతుంటే “ ఇక తినలేను అక్కా “ అన్నాను. .
..
ఇంకా అయోమయం పూర్తిగా వీడని నాకు ఒక పత్రిక తెరిచి చూపిస్తూ అడిగింది...
..
“రేయ్ నిజం చెప్పు ‘సు శ్రీ’ నువ్వే కదా? “
అందులో నేను రాసిన కధ ఉంది.
‪#‎33grader‬

No comments: