Thursday, 5 November 2015

కంపెనీ వి మూడు, నావి ఎనిమిది 3

సాయంత్రం అయిదున్నరకి నా పని పూర్తి అయ్యేది.బాస్ అద్దాల కేబిన్ కి మా ఆఫీసు రూమికి తాళం వేసి బజారున పడేవాడిని. 
ఎనిమిదిగంటల దాకా మద్రాసు మనదే..
ముఖ్యంగా పాండి బజార్ , పానగల్ పార్కు, మెరినా బీచి 
నడుచుకుంటూ ఎంతో దూరం తిరుగుతుందేవాదీని,
పాండి బజార్ లో సినీ నటుడు నాగేశ్ (హాస్య నటులు) గారి దియేటర్ ఉండేది అక్కడ తరచూ చిడతల అప్పారావు, పొట్టి ప్రసాదు, టీవి నటుడు బాలాజీ లాటి చిన్న నటులు కాలి నడకన తిరుగుతుండేవారు. వాళ్ళు ఎవరిని పట్టించుకునేవారు కాదు.. వారిని జనం కూడా.
నాకు కొన్నాళ్ళ పాటు గమ్మత్తుగా అనిపించేది.
పాండీ  బజార్ లో ఒక అద్దె  పుస్తకాల అంగడి ఉండేది. పుస్తకం ధర లో పది శాతం అద్దె తో పదిహేను రోజులు చదువు కోవచ్చు.. 
తెలుగు పుస్తకాలు తక్కువగా ఉండేవి అందులో. ఉన్న కొద్ది పుస్తకాలు గొప్ప రచయితలవి.
శ్రీ శ్రీ , చలం,కొకు,రాచకొండ  రంగనాయకమ్మ, ఆరుధ్ర, సినారె లాటి ఉద్దందులవి.
తక్కువ ఖర్చు తో ఎక్కువ రాబడి ఎప్పుడు పుస్తకాల ద్వారానే కలుగుతుంది.
నాన్న ని ఊరు పంపేటప్పటికి నావద్ద మిగిలిన 320 రూపాయల లోంచి అత్యంత పొదుపుగా వాడుకుంటూ 100 ధరావత్తు కింద చెల్లించేను. నిజానికి 15 రోజుల వ్యవది ఉన్నా మూడు నాలుగు రోజుల్లో చదివేసే వాడిని. 
ఆ గ్రంధాలయం లోనే హ్యూమన్ డైజెస్ట్ అని ఒక సాఫ్ట్ పోర్న్ పుస్తకం చూశాను. అది తీసుకు వెళ్ళి చదివాను. 
దాని ప్రభావం సంగతి తరువాత గాని నేను వ్యవహరిక ఆంగ్లం మాత్రం దాని నుండే నేర్చుకున్నాను. 
తరువాత చిన్నగా రీడర్ డజెస్ట్ లాటివి చదవటం, కొన్ని టిని తెలుగులోకి తర్జుమా చెయ్యటం చేస్తూండే వాడిని.నా వెంట ఎప్పుడు ఒక నిఘంటువు ఉంచుకునే వాడిని. కేవలం ఆంగ్లం నేర్చుకోవటం కోసమే ఈ పనులు చేస్తూండే వాడిని..
ఒక్కోసారి నడుచుకుంటూ మెరినా బీచ్ కి వెళ్ళేవాడిని. అక్కడ పిల్లలతో ఆనందించే కుటుంబాలని చూసినప్పుడు నాకు దేవ దూతలనీ చూసిన భావం కలిగేది.
బీచ్ లో అనేక తినుబండారాలు అమ్ముతూ ఉండేవారు.
సిద్దం చేసిన  సన్నటి నాలుగు అంగుళాల చాప ని అలానే బాండీ  లో వేసి బజ్జీలు గా అమ్ముతుండేవారు, బాగా రుచిగా ఉందేవేమో అనేక మంది గుమిగూడి మరి తింటుందెవారు. 
నేను కొన్ని డజన్ల సార్లు అక్కడే తచ్చాడే వాడిని. 
ఫ్లాట్ ఫామ్  మీద కొన్న 60 రూపాయల కాడ్రాయ్ ఫాంటు వెనుక జేబు నుండి వాలేట్ తీసి డబ్బు బయటకి తీయబోవటం, మళ్ళీ ఏవేవో గుర్తొచ్చి లోపల పెట్టటం. 
ముంత కింద  పప్పు, మామిడి బద్దలు , మద్రాసు వాళ్ళ జీవనాధారాలు చాలా చిన్నవి, వినూత్నంగా ఆలోచించడం లో వారే సాటి. 
అక్కడే ఇసుకలో తీసిన చలమ లో నీరు ఎందుకో తియ్యగా ఉండేది అవి గ్లాసు 10 పైసలు కి అమ్మేవారు. నేను అనేక సార్లు బీచికి వెళ్ళినా ఒక్క సారి గ్లాసు నీరు మాత్రం కొనుక్కుని తాగాను.
వాలేట్ మాత్రం అనేక సార్లు బయటకి లోపలికి మారుతూనే ఉండేది. 
..
బీచ్ లో ఒంటరిగా కూర్చుని ఎప్పుడు నాతో ఉండే పుస్తకం లో రాసుకుంటూ ఉండేవాడిని.
ఒక్కోసారి చీకటి పడేది. రూపాయి కంటే తక్కువ ఉన్న సిటీ బస్ లో తిరిగి టి నగర్ చేరేవాడిని...
..
మద్రాసు నుండే కధలు వ్రాసి పత్రికల కి పంపే వాడిని.నెలకి 50 రూపాయలు పోస్టల్ ఖర్చు కి కేటాయించే వాడిని. 15 పైసల విలువ చేసే కార్డు లు బల్క్ గా కొని రబ్బర్ బాండ్ వేసుకుని సిద్దంగా ఉంచుకునేవాడిని. కాగితాలు, కవర్లు మాత్రం కంపనీ వి వాడుకునే వాడిని. ..
..
నేను ఏ కధ వ్రాసినా తిరుగు టపా మాత్రం ఉంచే వాడిని కాదు. ..
తెలిక కాదు బడ్జెట్ ప్రాబ్లం .వీలయినంత వరకు రెండు మూడు ఆర్టికల్స్ కలిపి ఒకే కవర్ చేసి పంపేవాడిని.
..
పత్రికల నుండి చిరునామా సేకరించిన కొందరు, పరిచయం అయిన మరి కొండలు ఉత్తరాలు రాస్తుండే వారు. నేను మాత్రం లీగల్ కాగితం అంత మేటర్ ని కార్డు మీద వ్రాసి సమాదానం ఇస్తుండేవాడిని.
..
ఒక రోజు పోస్ట్ మన్ ఇచ్చిన ఉత్తరాలు మొత్తం షెల్లార్ లో ని నివసించే  పని మనిషి, 
పట్టు కెళ్ళిపైన ఇంట్లో ఉన్న  మా బాస్ కి ఇచ్చింది. 
వాట్లో కంపెనివి మూడు కవర్లు నా ఉత్తరాలు ఎనిమిది దాకా ఉన్నాయి..
.అరగంట తర్వాత మా బాస్ నుండి నాకు పిలుపోచ్చింది పని మనిషి ద్వారా :(
#33grade

No comments: