Thursday, 5 November 2015

జీవితం ప్రారంభం. 1

నేను వారి వద్ద పని చేసిన దానికన్నా నేర్చుకున్నదే ఎక్కువ.
కేవలం మా ఇద్దరి స్వగ్రామం ఒకటే అవటం, మా నాన్న గారు ఇచ్చిన ఆధారాన్ని బట్టి నేను ఉత్తరం రాయటం ఆయన స్పందించి రమ్మనటం జరిగి పోయింది.
**
1986 జనవరి 31 వ తేదీ వైవా రాశాను. LCE పూర్తి అయినట్లు సి‌సి‌సి తీసుకున్నాను. 
నేను చదివిన దామచర్ల ఆంజనేయులు ప్రభుత్వపాలిటెక్నిక్ లో చదువు పూర్తి అయ్యింది.
మా నాన్న కి మరో సవత్సరం సర్వీసు ఉండేది. నేను వారికి లేటు గా పుట్టిన వాడిని.
మా నాన్న కి నేను గారాల కొడుకుని. త్వరగా సెటిల్ అవ్వాలని, క్లాసులు పూర్తిగా చదవకుండానే తర్వాత క్లాసుకు లాక్కు వచ్చేవాడు పుట్టిన తేదీని ఫస్ట్ ఫామ్ లో చేర్చేటప్పుడు మారిపించారు.
***
చదువు పూర్తయిన ఎనిమిదవ రోజు నేను నాన్న మద్రాసు మహా పట్టణానికి చేరాం.
నాన్న అప్పట్లో ఒంగోలు లోనే బజార్లు గుర్తించడం లో పొరపాట్లు పడేవారు.
ఆటాటి ఆయన నేను కలిసి ఎప్పుడు చూడని నగరం లో ఎప్పుడు చూడని మనిషిని కలిసి నా జీవితం ప్రారంభించాలని బయలు దేరాం.
సెంట్రల్ లోతెల్లవారు ఝామున ట్రైన్ దిగితే (ఒంగోలు నుండి పాసింజర్ కి 14 ఎక్స్ప్రెస్ కి 29 ఛార్జీ)
6-00 కి అక్కడికి చేరాం ఆరవ వాళ్ళ తో బెరుగ్గా మాట్లాడి సిటీ బస్సు ఎక్కి, టి నగర్ ఎక్కి చేతి లో ఫ్రమ్ అడ్రెస్ ప్రింట్ చేసిన కవర్ తప్ప మరేమీ ఆధారం లేదు.
(గూగుల్ లు సెల్ ఫోనులు లేవు అని గమనించాలి )
కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడు అన్నట్లు అప్పుడే కాలింగ్ బెల్ మోగించాం బిడియంగానే.
కిందనున్న పనావిడ నిద్రలేచి, కొన్ని ప్రశ్నలదిగి పైకి వెళ్ళి 'వారిని' నిద్ర లేపింది.
ఆరడుగుల ఆయన పోర్టికోలోకి వచ్చి మమ్మల్ని, మా ఆకారాలని, ముఖాల్లో ఉన్న ఆందోళని చూసి పైకి రమ్మనట్టు సైగ చేశారు.
మొదటి అంతస్తు లో ఉన్న వారి ఇంట్లోకి బెరుకు బెరుకుగా వెళ్ళాం, మా సంచీ ని శుబ్రంగా ఉన్న మజాయిక్ ఫ్లోరింగ్ మీద ఉంచడానికి చాలా బిడియ పడ్డాం. ఆయన ముందు నేను చేతులు కట్టుకుని నిలబడ్డాను. నాన్న సోఫాలో బిడియంగా కూర్చున్నారు. నన్ను కూర్చో మని అన్నాక నేను కూర్చోక తప్పింది కాదు. ఆయన శ్రీమతి నిద్ర లేచి ఉన్నారు. ఆమె టి తయారు చేసి హల్లో కి తచ్చి మాకు ఇచ్చి మా నాన్న ని పలకరించి వెళ్లారు.
"మీ వాడిని వదిలి వెళ్ళండి . నేను చూసుకుంటాను' అన్నాడాయన.
పైన కానీ కింద కానీ బాత్ రూములున్నాయి స్నానం చేయండి టిఫిన్ చేద్దాం అన్నారాయన.
మా భయాలు పోగొడుతూ .
ఆ రాత్రి మా నాన్న ని తిరుగు రైలు ఎక్కించి, నేను శ్రీనివాసా కన్స్ట్రక్షన్ కంపెనీ లో అడుగేట్టాను.
శ్రీ ఇడమకంటి కోటి రెడ్డి గారి శిష్యుడిగా ..
item rate value workout చెయ్యటం నేర్పించి మిలటరీ ఇంజనీరింగ్ వర్క్స్ టెండర్ నోటీస్ లు ప్రకారం కంపెనీ కోట్ చెయ్యాల్సిన రేటు వర్క్ ఔట్ చేస్తుందేవాడిని.
నేను వారి వద్ద పని చేసిన దానికన్నా నేర్చుకున్నదే ఎక్కువ.
**
నెలకి 400 రూపాయల జీతం .
ఉండటానికి ఏకామిడేషన్.
ఆ కేక ...
శీను గాడు/రోశయ్య పంతులు కొడుకు మద్రాస్ లో ఉద్యోగం అని ఊర్లో పేరు.
నా సామి రంగా జీవితం ప్రారంభం అయింది. 9 ఫిబ్రవరి 1986 నుండి.
------------------------ నేను రాసుకుంటున్న "33 గ్రేడ్" నుండి మరో భాగం.

No comments: