Friday, 20 November 2015

ఆర్గనైజేషన్ 24

అక్కడంతా ఒక పద్దతిగా ఉండేది. మెన్ &  మెటీరీయల్ ఏర్పాటుకి సూపర్వైజర్లు , చిన్న వర్క్స్ చేయించడానికి , JE (డిప్లొమా ఇంజనీర్లు –నాలాటి వాళ్ళు ), కీలకమయిన పనులు  పనులు చేయించడానికి AE (గ్రాడ్యుఏట్ ఇంజనీర్లు ) ఉండేవారు.

శరావణా కంపెనీ RCI కాంపస్ లో అనేక పనులు చేయిస్తూండేది.  వీటన్నిటిని అజమాయిషీ చేయటానికి ఈశ్వరమణి అనే టెక్నికల్ వర్క్స్ ఇంచార్జ్ , పర్చేజెస్ అడ్మినిస్ట్రేషన్ కి ఒక ఆదినారాయణ , ప్రాజెక్ట్ అధికారి దొడ్డప్ప ఉండేవారు. నేనా కంపెనీ లో పనిచేసినంత కాలం ప్రధాన కొంట్రాక్టర్ ని చూడలేదు.
అన్నప్రసాన రోజే ఆవకాయ అన్నట్లు నన్ను  యూనిట్1010 కి కేటాయించారు. నిజానికి ఒక AE కి ఇవ్వాల్సిన పని  అది. రెజ్యూమ్ లో మనం చూయించిన అతుత్సాహం కి ఫలితం ఇది. మిలటరీ అవసరాల కోసం నిర్మించే అనేక భవనాల సముదాయం అది. MECON  (military engineering consultants) అనే సంస్థ వారు మాకు (అంటే కాంట్రాక్టర్ కి ) ప్రభుత్వానికి మధ్య క్వాలిటి కొంట్రోలర్ లు గా వ్యవహరిస్తుండేవారు.
ఇండియన్ మిలటరీ కి సంబందించి ఆయుధాల పరిశోదన, తయారీ అక్కడ జరగబోతుంది. ఒక్కో భవనం సుమారుగా 70 నుండి 100 మీటర్ల  పొడవు, 30 నుండి 40 మీటర్ల వెడల్పు 9 మీటర్లు తగ్గకుండా వుండేవి.


ఇవి కాక స్టాఫ్ క్వార్టర్స్, కార్యాలయాలు ఉండేవి. ఒక భవనం నుండి మరో భవనం కనీసం ఫర్లాంగ్ దూరం లో ఉండేది. అప్పట్లో శరవాణా సంస్థ 18 కి పైగా పనులు నిర్వహిస్తూండేది. వేలాది మంది తమిళ, కన్నడ, తెలుగు కూలీలు ఆ ప్రాంతానికి దగ్గర లోనే చిన్న చిన్న గుడారాలు లాటివి వేసుకుని ఉంటుండేవారు.
భాషతో అసలు సమస్య ఉండేది కాదు. అంధరికి మూడు నాలుగు భాషలు అర్ధమవుతాయి.  ఒక్కొక మెస్తి కింద 20 నుండి వంద దాకా కూలీలు ఉండేవారు. ఎక్కువబాగం యూనిట్ రేటుకి పనులు చేయిస్తుండేవారమ్. వీరు కాక రెగ్యులర్ హమాలీలు ఎటు ఉండే ఉండేవారు.  
రోజుకి 3 కిలోమీటర్ల తారు రోడ్డు వేయగలిగిన ఎక్విప్మెంట్ ఉన్న RECONDO  అనే సంస్థ రోడ్లు వేస్తుండేది. ఏతైన వాటర్ టాంక్ లు పవర్ స్టేషను, సబ్ స్టేషన్లు .. ఎటుచూసినా పనులు ఒక సామ్రాజ్యాన్ని నిర్మిస్తున్నామా అన్నట్లుగా ఉండేది. అంతా కొండ ప్రాతం అవటం వల్ల స్థలాన్ని చదును చేయటం కోసం బ్లాస్టింగ్లు లు జరుగుతుందేవి . సామాన్యంగా ఇవి తెల్లవారగట్ల ఇంకా చెప్పాలంటే పని వేళలు మొదలవక ముందే జరుగుతుండేవి . చాలా సార్లు బ్లాస్టింగ్ చేసిన రాళ్ళు ఎగిరి వచ్చి 2 కిలో మీటర్ల దూరం లో కూడా పడుతుండేవి. నాలుగువందల కిలోమీటర్ల విస్తీరణం లో మా క్వార్తెర్స్ కి నాలుగు కిలో మీటర్ల దూరం లో ఒక పవర్ స్టేషన్ నిర్మాణం జరుగుతుండేది.  ఒక సర్కిల్ ని వ్యాసం మీద అర్ధ చంద్రాకారాలని జరిపినట్లుగా అక్కడక్కడా సబ్ స్టేషన్స్ నిర్మాణం జరుతుండేవి . ఎత్తైన ఓవర్ హెడ్ టాంక్ ల నిర్మాణం జరుగుతుండేది. అంతా కోలాహలంగా ఉండేది. టంకర్లలో సమీపం లోని  చెరువుల నుండి నీళ్ళు తెస్తుండేవారు. ప్రతి పని జరిగేచోట్ నెలలో తవ్విన గుంతలకి నాపరాళ్ళ లైనింగ్ వేసి తాత్కాలిక టాంక్ లు కట్టించేవాళ్లు . అందులో నీరు నింపి నిర్మాణానికి వాడుకునే వారు. కొన్ని ట్రాక్టర్స్ నీళ్ళు వర్కర్స్ ఉండే ఏరియాలలోనూ  సరఫరా జరిగేది. మా క్వార్టర్స్ కి కూడా అవే టంకర్స్ నీళ్ళు సప్లై చేస్తుండేవి.
ముందు రోజు JE లు AE లు చెప్పిన ప్రకారం మెన్ & మెటీరీయల్ సుపర్వైజర్లు  ఏర్పాటు చేసేవారు. వర్క్స్ డ్రాయింగులు ఇచ్చేవారు, సర్వే కి పనికి వచ్చే అన్నీ రకాల ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఆఫీసులో ఉండేవి. చిన్న కుర్రాళ్ళు ఒక చిన్న మోపెడ్ మీద తిరుగుతూ ఇంజనీర్లకి నీరు, టి సప్లై చేస్తూండే వారు. కంపెనీ జీపులు రెండు ఎప్పుడు సిద్దంగా ఉండేవి వాటిని కూలీలని  అత్యవసరం లో సిమెంటు లాటివి రవాణా కి వాడేవారు.
ప్రతి శనివారం దినసరి హమాలీలకి కూలీ, కాంట్రాక్ట్ వర్కర్లకి యూనిట్ ప్రకారం మేస్త్రీలకి బిల్లులు తయారు చేసే భాధ్యత కూడా సైట్ ఇంజనీర్లదే . అన్నింటికన్నా ముఖంగా మేకాన్ ఇంజనీర్ల చేత చేయబోయే ప్రతి పని సంబందిత కాగితాల మీద వ్రాసి వారు సంతుప్తి చెందినట్లు సంతకాలు తీసుకోవటం. కాంట్రాక్టర్ కి బిల్లులు చెల్లింపు కి అవే కీలకం.


నిర్మాణం లో ఉన్న అన్నీ భవనాలని మైన్ పవర్ స్టేషన్ నుండి సబ్ స్టేషన్స్ ని కలుపుకుంటు ఒక ‘U’ ఆకారం లో నేలని తవ్వి అడుగు పైకి అయిదు అడుగులు కిందకి వచ్చెట్టుగా ఒక కాంక్రీట్ కాలవ లాటి నిర్మాణం , వాటిలో ఒక నడవటానికి సరిపోను మిగతా బాగం లో మూడు చజ్జాల లాటి ఇనుప వెల్డింగ్ నిర్మాణం, దాని పైన ప్రీ కాస్ట్ మూతలు వేయటం మొత్తాన్ని unit 1010’ అంటారు. ఆ పని ప్రారంభించే చోట నుండి ముగించే చోట వరకు SECON (survey engineering consultant) అని మరో సంస్థ ఎచ్చిన లెవెల్స్ ప్రకారం చేయాల్సి ఉంటుంది. లెవెల్ అంటే సముద్రమట్టానికి ఆ ప్రాంతం ఎంత ఎత్తులో ఉంటుంది అనేది. దీని ప్రకారమే ఏ హైట్ నయినా నిర్దేశిస్తారు. (ఎవరెస్ట్ లాటివి)
ఉదాహరణకి ప్రతి రైల్వే స్టేషన్ లో ఊరి పేరు బోర్డు కి కుడివైపు కింది MSL (mean sea level) + 7.70 mts లాటి అక్షరాలు ఉంటాయి గమనించండి. అంటే ఆ ప్రాంతం సాదారణ సముద్రపు మట్టం నుండి 7.7 మీటర్ల ఎత్తులో ఉంది అని అర్ధం.
#33grade


No comments: