Sunday, 8 November 2015

బర్మా బజార్ (ప్యారిస్) 9

నడి నెత్తికి ఎండ వచ్చే సరికి వినోద్  వచ్చాడు.
వచ్చీ రాగానే ఎంత సేపయింది వచ్చి?’ అని అడిగాడు.
 అతను గుర్తుపట్టినందుకు సంతోషం వేసింది. ఏదయినా ఆదివారం రోజు కలుస్తాను అని ఒంగోలు లో కలిసినప్పుడు చెప్పాను .
..
"సారి అనుకోకుండా లెటయింది. పైగా నువ్వు వచ్చే విషయం నాకు తెలియదు వచ్చేవారం షూటింగు షెడ్యూల్ చూసుకుని వస్తున్నాను".
అతను నాతో మాట్లాడుతూనే  అత్యంత చాక చక్యంగా డబ్బాలో ఆటాని కలిపి,
ఒక పీటమీద వత్తి , గాలి కొట్టే ఒక కిరస్నాయిలు స్టౌ మీద రెండు  చపాతీలు చేశాడు(పిండి అంతే ఉన్నట్టు ఉంది). తర్వాత ఒక గిన్నెలో రైస్ వేసి పొయ్యి మీద పెట్టి, ఒక చివరగా ఉన్న కామన్ బాత్ రుము లో  స్నానానికి వెళ్ళి వచ్చాడు.
..
అతను వచ్చే సరికి స్టౌ ఆరిపోయింది.. తీరా చూస్తే కిరోసిన్ అయిపోయింది.
అన్నం ఉడకటం ఇంకా మొదలవలేదు.  కిరోసిన్ సీసా చూస్తే ఖాళీ .
..
అతను ఏమాత్రం ఆశ్చర్య పోకుండా ఇదంతా తనకి మామూలే అన్నట్టు
రూములో ఒక కాగితం లో చుట్టిన చిన్న కరెంటు హీటర్ తీసి శుబ్రంగా కడిగి సగం ఉడికిన అన్నం లో ఉంచి సాకెట్ లో పెట్టి స్విచ్ వేశాడు.
..
నేను అతన్ని ఐయినిస్టైన్ లాగా చూశాను.
.
అతను డ్రస్ చేసుకుని చకచక్యంగా వండిన అన్నాన్ని,
చపాతీలని సమానంగా పంచి, ఒకే ప్రెస్ కవర్ లోంచి అల్లం చేట్నీ,తీసి వడ్డించాడు.
తినమన్నట్టు తల ఉపాడు.
.
నేను ఏదో అడగబోతుంటే అతనే ఆకలి అవసరం అన్నీ నేర్పుతాయి అన్నాడు.
ఒంగోలు లో కలిసి నప్పుడు దాసరి నారాయణరావు కి అంతా తానే అని చెప్పిన ఇతనేనా అనిపించింది. దానికి అతను సమాదానం కూడా చెప్పాడు..
 బేసిగ్గా అసిస్టెంట్ డైరెక్టర్ అని చెప్పుకునే చాలా మంది గొడుగు పట్టుకుని,
కుర్చీలు వెయ్యటం చేస్తుంటారని .
 ఇదంతా బ్రతుకు పోరాటం అని
..
పెద్దవాళ్లతో పరిచయాలు ఎలా ఉంటాయంటే  టేబుల్ మీద మందు తాగితే ఎంతయినా పోస్తారు,.. గిద్ద బియ్యం కొనుక్కుంటా మంటే  డబ్బులు మాత్రం రాల్చరు.
షూటింగు ఉంటే అన్నీ అక్కడే నడుస్తాయి . లేనప్పుడే ఇలా ఏదో ఒకటి
అర్దం కానంత విషయం ఏమి లేదు అందులో ..
ఒక్కొక్కరిది ఒక్కో బ్రతుకు పోరాటం.
..
తర్వాత అతను నేను కొన్ని చీకటి కోణాలు మాట్లాడుకుంటూ
 ‘పారిస్’ (బర్మా/చైనా  బజార్) కి వెళ్ళాం ...
..
నా జేబులో పర్సు అందులో కొంత డబ్బు కూడా ఉంది. ..
అతని జేబులు పర్సు మాత్రమే ఉంది.
..
పారిస్ అంటే మద్రాస్ పార్క్ స్టేషన్ గోడ ఆనుకుని ఉండే అనేక చిన్న 5 x5 సైజు మించని వందల షాపులు సమూహం. చూడటానికి ఒకే మాదిరిగా ఉంటాయి.
అయిదు ఆరు అడుగు లు మించని కారిడార్ ప్రధాన రోడ్డు ని దుకాణాలని విడదీస్తు ఉంటుంది. కారిడార్ రెండో వైపు కూడా చక్క బల్లాలు  మీద కూడా  వ్యాపారం జరుగుతుంది...
వాటిలో దోరకని స్మగుల్డ్ వస్తువులు ఉండవు, ..
akai  విసిపి లు వీసీయార్ లు , టీవీలు మినీ వి,  క్యాలుక్యులేటర్ లు , సూటికేసులు,బట్టలు, గడియారాలు, డిజిటల్ వస్తువులు , బాటరీ  బొమ్మలు, బూతు సినిమాల కాసెట్లు, సాహిత్యం , ఫోటోల పుస్తకాలు , బూట్లు, గొడుగులు, సాక్స్ , టై లు  డిజిటల్ డైరీ లు , మిక్సీలు వాట్ నాట్ ? tdk ఆడియో కాసెట్లు, స్టీరియో లు, జపాన్ ట్రాన్సిస్టెర్లు , లైటర్లు, పర్సులు మరెన్నో
...
ఒక్క సారి బేరం అడిగామంటే కోనాల్సిందే .. సిండికటే గా ఉంటారని ..
తమిళం రాని వారిని,అమాయకులని, ఒంటరివారిని ఎక్కువగా మోసం చేస్తారని .
జాగర్తగా ఉండమని చెప్పాడు అతను.
..
నేను పార్క్ నుండి మాంబలం లోకల్ రైల్ లో ఎలా వెళ్లలో చెప్పి అతను వెళ్ళి పోయాడు. ..
..
అతను వెళ్ళాక అతి విశ్వాసం తో నేనొక  తప్పు  చేశాను.

#33grade

No comments: