Thursday, 19 November 2015

సిగ్మా -23

ఆవేశంగా తలకి ఎత్తుకుని నడవటం మొదలెట్టాను గాని ఫర్లాంగు దాటే సరికి మాడుమంట. పెట్టేని క్రిందకి దించాను. టిఫిన్ చేసే టప్పుడు అక్కడ త్రాగిన నీరు రుచిగా లేదు శుచిగా లేదు. అప్పుడు తక్కువగా తాగటం వల్ల దాహం మొదలయ్యింది. గమ్యం దగ్గరలో లేదు . 
ఎండ పెరిగేదే కానీ తరిగేది కాదు. 
పెట్టె లోంచి ఒక తువాలు తీసి తలకి చుట్టుకున్నాను. తిరిగి తలకి ఎత్తుకున్నాను . దేవుడిని స్మరించుకున్నాను. అనూష నవ్వు గుర్తొచ్చింది. నడవటం మొదలెట్టాను.
శరవణా ఆఫీసు కి వచ్చే సరికి దాదాపు సృహ తప్పెలా ఉన్నాను. కామన్ వరండాతో వెడల్పుగా రేకులు దించిన సైట్ ఆఫీసు వరండాలోకి పెట్టేని దించి దాని మీదే కూలబడ్డాను.


 
ఆఫీసు లోంచి ఎవరో వచ్చారు. చల్లటి ఫ్రీడ్జ్ నీరు బాటిల్ ఇచ్చారు .
అందులో అమృతం ఉంది . తాగాను. మరో బాటిల్ ఇచ్చారు ముఖం మీద పోసుకున్నాను. వరండాలో బెంచీ మీద గోడకి ఆనుకుని కూర్చున్నాను చాలా సేపు. 
ఏ కాగితం చూపించకుండానే వాళ్ళకి అర్ధం అయ్యింది. ఒక కుర్రాడు వచ్చి నా సూటికేసు తీసుకుని వాంగోఅన్నాడు. 
ఆఫీసు కి దగ్గరలో ఉన్న క్వార్టర్స్ కి వెళ్ళాను. ఎనిమిది రేకుల రుములకి ఒక వైపు టాయిలేట్ లు మరో వైపు కిచెన్ &డైనింగ్ ఉన్నాయి. నన్ను దిగబెట్టిన రూములో సూటికేసు ఉంచాక బట్టలు, మగ్గు, సబ్బు తీసుకుని స్నానానికి వెళ్ళాను ఒక పెద్ద తొట్టి లో నీళ్ళు రెండు బక్కెట్లు ఉన్నాయి. స్నానం ముగించి బట్టలు మార్చుకునే సరికి, అదే పిల్లాడు వచ్చి రెండో వైపున్న డైనింగ్ కి తీసుకెళ్ళాడు.
శనగల కూర చపాతీ వడ్డించారు. ఆవురావురు మని తిని లోటా నిండా మజ్జిగ తాగాను. ప్రాణం లేచి వచ్చింది.
నార్మల్ అయ్యాను. జాయినింగ్ ఆర్డర్ తీసుకుని ఆఫీసుకి వెళ్ళాను.
బెంగుళూరు లో ఇంటర్వ్యూ చేసిన దొడ్డప్పగారి రూములోకి వెళ్ళాను.
మిస్టర్ రావు బన్రి నేను చుట్టూ పరికించి చూసి నన్నే నని గ్రహించి విష్ చేసి కూర్చున్నాను. టేబుల్ సొరుగు లోంచి ఒక ఫైల్ తీశాడు.అందులో నేను చెంగుళూరు ఆఫీసులో ఇచ్చిన రెజ్యూమ్ ఉంది.

అలలు ఉండని చెరువు నీటి పైమట్టానికి బెంచ్ మార్క్ టెంపరరీ గా తీసుకుని చెరువు రెండో వైపుకి వచ్చి , అదే నీటి ఉపరితలం మీద నుండి లేవలింగ్ మొదలెట్టవచ్చు నా సమాదానం చదివి గుడ్అన్నాడు ఆయన.

రెండో ప్రశ్నకి సమాదానం రాసింది మీరొక్కరే అన్నాడు ఆయన. ఇంటర్వ్యూ మొహమాటానికే , ఇక్కడికి వస్తామని సిద్దపడి వచ్చిన వారందరికి జాయినింగ్ రిపోర్ట్స్ ఇచ్చాం 12 మందికి ఇస్తే జాయిన్ అయ్యింది మీతో కలిపి ఆరుగురు. కన్నడ తెలుగులో చెప్పాడు ఆయన.
రెండో ప్రశ్నకి సమాదానం ఒకసారి తూకం వేస్తే చాలు అని రాసావు ? ఎలా చెప్పగలిగావు ? అడిగాడు ఆయన.
సిగ్మా’ 12 విలువ 78 (1+2+3+4+5+6+7+8+9+10+11+12=78)

అన్నీ 15 గ్రాముల బరువు ఉంటే మొత్తం 1170 గ్రాముల బరువు తూగాలి. మొదటి డ్రమ్ నుండి ఒకటి రెండో దాని నుండి రెండు అలా తీసుకుని మొత్తాన్ని తుస్తే, ఎన్నిగ్రాముల బరువు తగ్గితే అన్నో డ్రమ్ లో లోపం ఉన్నట్టు
ఉదాహరణ కి 8 వ డ్రమ్ లో 14 గ్రాముల బొల్ట్స్ ఉంటే 70x15+8x 14=1162 గ్రాములు తూగుతుంది. అంటే సరిగ్గా ఎనిమిది గ్రాములు తగ్గుతుంది

ఇంకొంచెం వివరంగా చెప్పాను. 
సమాదానం నాలు గు సార్లు అని ఇచ్చినా ఆ తెలివితేటలు మాకు చాలు అనుకున్నాం . ఆరోక సారి, మూడోక సారి, రెండు ఒక సారి, అప్పటికి సమాదానం రాక పోతే ఒక్కోటి ఒక్కో సారి ఇలా  
నా కొలీగ్ భాస్కర రాజు ఆని ఒకతను ఉండేవాడు బెంగుళూరు లో ఆయన సమస్యని ఎలా పరిస్కరించాలో చెబుతుండేవాడు నేను చెప్పాను.

స్వంత జీవితానికి అప్ప్లై చేసుకుని ఉండడు .నాకు తెలిసినంత వరకు

ఎంత ఖచ్చితంగా ఊహించాడు అనిపించింది.
ఆయన లేచి నిలబడి “welcome to saravana family “ 
వెళ్ళి రెస్ట్ తీసుకోండి. రేపు మాట్లాడుకుందాం అన్నారు నా ముఖం లోని అలసటని గమనించి. 
‪#33grade

No comments: