Wednesday, 18 November 2015

రంగుల లాల్ భాగ్ -21

సిగ్మాని భాస్కరరాజు ని తలుచుకుని అర్ధగంటలో రెజ్యూమ్ ఆఫీసులో 
ఇచ్చి అక్కడ నుండి నేరుగా లాల్ బాగ్ వచ్చాను.
..
అద్బుతమయిన లాల్ బాఘ్అందాలు, పూల పరిమళాలు, ..క్రమ పద్దతిలో పెంచిన అనేక రకాల క్రోటాన్స్, వాటిని వివిద ఆకారాలలో కి మార్చిన పనివాళ్ళ పనితనం చూడాల్సిందే.
లాల్ బాఘ్ ప్రదాన ద్వారం దగ్గరగా ఒక పెద్ద గడియారం ఉంటుంది. 
రంగు రంగుల క్రోటాన్స్ అంకెలుగా పెద్ద ఇనుప బద్దలు గంటల, నిమిషాల, సెకన్ల ముల్లు తో ఎల్లప్పుడు కరెక్ట్ టైమ్ చూపిస్తూ ఉంటుంది. 
అది ఒక ప్రత్యేక ఆకర్షణ. 
విశాలంగా ఉండే లాల్ బాఘ్ పొదల లోకి తొంగి చూసినప్పుడు, వాత్సాయనుడు ఇక్కడే కూర్చుని తన గ్రంధాన్నిరాశాడేమో అనిపిస్తుంది. 
..
ప్రతి ఏడాది జరిగే గులాబిల ప్రదర్శన ఎవరి మనసునయినా దోచేస్తుంది ట...
..
తిరిగి నేను నా డెన్ కి వచ్చేసరికి బాగా పొద్దు పోయింది. 
వెంకట్రావు గారు ఇంటర్వ్యూవిశేషాలు అడిగారు. చెప్పాను. ...
..
అంతా హడావిడి. ఆ అడివిలోకి పోయి పనిచేసేవాడు దొరకొద్దూ ? మెట్రికులేషన్ ఫైల్ అయినా ఆరునెలల్లో నేర్చుకోవచ్చు మనం చేసే పని. నిజానికి వాళ్ళే లేబర్ తో కరుగ్గా మాట్లాడి పని చేయించగలరు. చెయ్యగలరు. కన్సుల్టెంట్స్ కి చూపించడానికే ఈ పట్టబద్రుల వేట. అంతే
నేను నవ్వేశాను.
కానీ ఆ కంపెనీ లో కొంత ఇండివిడ్యువాలిటీ ఉన్నట్లు నేను విన్నాను. Lets hope the best” ఆయన పడుకుంటూ అన్నాడు. ..
**
మర్నాడు శనివారం నేను ఒక ముస్లిం మేస్త్రి కి బిల్లు తయారు చేసినప్పుడు ఒక గొప్ప విషయం గమనించాను. అతను తన బార్య , కొడుకుతో వస్తాడు. మంచి ఎండలో బిల్డింగ్ ఎలివేషన్ పూతపని చేస్తాడు కుటుంబ సబ్యులు అతనికి మాలు కలిపి అందించడం లో సాయ చేస్తారు. రోజుకి కనీసం 3 యూనిట్లు తగ్గకుండా పని చేస్తాడు. 
సాదారణంగా 2 యూనిట్లు (200 sft ) చెయ్యాటమే అత్యుత్తమం. మంచి క్వాలిటీ తో చేయటం ఇంకా గొప్ప విషయం. రంజాన్ మాసం ఉపవాసం చేస్తూ, ఉమ్మి కూడా మింగకుండా నిండు టెండలో పని చేయటం .. చాలా అద్భుతంగా అనిపించింది. 
..
నేనతన్ని అమితాబ్ బయ్యా (పొడవుగా ఉండేవాడు) అనేవాడిని. ..ఒక సైట్ ఇంచార్జ్ అలా పిలవటం అతను ఊహించనిది. గుర్తింపు ఎవరికయినా ఆక్సిజన్ లాటిది. 
రంజాన్ కి అమితాబ్ ఇంటి నుండి వచ్చిన కారేజి కి వెంకట్రావు గారు నేను ఇద్దరం పోటీలుపడి న్యాయం చేశాం. 
..
శరవాణానుండి పిలుపు వస్తే వెంటనే వెళ్ళి పోటానికి రంగం సిద్దం చేసుకున్నాను. 
విశ్వేశ్వరాయ మ్యూజియాన్ని, మరికొన్ని సందర్శనా స్తలాలని మా వెంకట్రావు గురువు గారితో కలిసి చుట్టేశాను. 
..
మొత్తం సామానంతా యుటిలిటీ బిల్డింగ్ లో కొన్న సూటికేసు లో పట్టెట్టు ట్రిమ్ చేశాను. 
మళ్ళీ శుక్రవారం వచ్చేసింది. ..
..
నేను శరవణాకి వెళ్ళాను...
..
రెండు రంగుల రిబ్బన్ వాడి టైప్ చేసిన జాయినింగ్ ఆర్డర్ కవరులో ఉంది ..
వాళ్ళ రిజిస్టర్ లో సంతకం పెట్టి మూడొందలు ప్రయాణ బత్యం తీసుకున్నాను.

మనసులో ఈల వేసుకుంటూ బయలు దేరాను. 
..
త్రోవ లో ఒకచోట ఆగి వెంట తెచ్చుకున్న కార్డు లో నాన్నకి నేను ఉద్యోగం మానుకుని వస్తున్నట్టు మాత్రమే రాసి పోస్ట్ బాక్స్ లో వేశాను. .
...
అక్కకి ఈ ఉత్తరం నికు అందిన రెండురోజుల్లో వస్తున్నాను. వెయ్యి రూపాయల బడ్జెట్ లో నీకు/అనూష కి కావల్సిన ముఖ్యమయిన వస్తువులు లిస్ట్ రాసుకోఅని వ్రాసాను...
..
కానీ నేను అనుకున్నంత సులువుగా అది జరగలేదు.
‪#33grade

No comments: