Wednesday, 11 November 2015

బీదగా చావటం తప్పు -12

మంచి చెడుల  విశ్లేషణ చేసుకోటానికి ఇబ్బంది పడే వయసులో కొన్ని విషయాలు మనన్ని కలవర పెడతాయి.
బలమయిన అయస్కాంత క్షేత్రాలుగా మారి మనన్ని ఆకర్షిస్తాయి.
అలాటి కొన్ని విషయాలు నాకు జీవితం లో కొంత ముందు గా తెలియటానికి కారణం రామనాధం (మా రెండో కొలీగ్). రామనాదం సుమారు 65 సంవత్సరాలు పై బడిన వాడయినా ఎందుకో ఇప్పటికీ గౌరవంగా సంబోదించ దానికి మనసు రావటం  లేదు. తెల్లటి అడ్డ పంచే, చొక్కా నుదిటిన బొట్టు, రెక్సిన్ తో కుట్టిన పొడుగు కాడల సంచి బుజాన తగిలించుకుని ఆవడి నుండి లోకల్ ట్రైన్ కి మాంబలం వచ్చి అక్కడి నుండి సైకిల్ మీద ఆఫీసుకి వస్తాడు.
అతను తపాలా పని, బజారు పనులు చూస్తాడు. రాత కోతలతో అవసరం లేని అటెండర్ పని చేస్తుంటాడు. అతని కి ఇచ్చేది కూడా తక్కువే. ఆఫీసు ఖర్చు తో  ఉదయం ఒక సారి సాయంత్రం ఒక సారి టి తెచ్చుకు తాగే వారం. ఒక లీటరు సీసా ని ఫ్లాస్క్ లాగా వాడే వారం. ఆయనే వెళ్ళి సీసా వేడినీళ్లతో రిన్స్ చేయించి తీసుకొచ్చేవాడు.
నేను పిల్ల చాస్టాలు మాని సీరియస్ గా వర్క్ నేర్చుకోవటం మొదలెట్టాను. Estimating and costing లో ప్రధానమయిన DATA బుక్ ని అర్ధం చేసుకోవటం, రెగ్యులర్ ఐటం లు కాకుండా కొత్త వర్క్ కు లకి మెటీరియల్ క్వాంటీటీ ఎలా లెక్కించాలో నేర్చుకోవటం మొదలెట్టాను.
నిజానికి నేను నా జీతానికి తగిన పని చేయలేదు. ఎక్కువ బాగం నేర్చుకుంటూనే ఉన్నాను. ఒక రకంగా మద్రాస్ లో ఉన్నంత కాలం సివిల్ ఇంజనీరుగా స్టైఫండ్ తో కూడిన ట్రైనింగ్ పీరియడ్ అనొచ్చు.
రామనాధం సంచి లో మధ్యాహ్నం బోజనమ్ మాత్రమే కాకుండా కొన్ని పుస్తకాలు కూడా ఉండేవి.
ఒక పుస్తకం మీద “ తెల్లటి పిల్లులు నల్లటి పుంజులు “ అని ఇంగ్లీష్ లో ప్రింట్ అయి ఉండటం చూశాను. వాటిని ఆయన చాటుగా చూసుకుంటుండే వాడు. అతను నాకు  కొంత అనవసరమయిన విషయాలు చెబుతుండేవాడు. ఒకసారి మెరినా బీచ్ కి వెళ్తుంటే రద్దీ గా ఉన్న బస్సులో ఒక వ్యక్తి అనవసరంగా ఎక్కువ వత్తిడితో ఆనుకోవటం నాకు వింతగాను అసహ్యం గాను అనిపించిది. సరిగ్గా రామనాదం గారిని చూస్తే అలానే అనిపించేది.

 (ఈ టాపిక్ ఇంతటితో ముగిస్తాను. పిల్లలకి సైన్స్, లెక్కల లాగానే కొంత మంది ముసలాల్లు ఇలాటి చెత్త నేర్పుతారు. వారి నుండి పిల్లలని కాపాడుకుందాం.)
పానగల్ పార్కు లో సాయంత్రం పుట బండి మీద కిచిడీ విత్ ఆమ్లెట్ అందుబాటు రేటులో దొరకటం నేను గమనించాను. కొంత మంది పార్కు లో తాగి పడేసిన (?) సీసాలు పోగు చేసుకుని అమ్ముకుని వాటి తో తినటం కూడా నాకు తెలుసు. మనిషి బ్రతుకు పోరాటాలు ఎంత వైవిద్యం గా ఉంటాయి?
ఎవరో అన్నట్లు “బీదగా పుట్టటం నీ తప్పు కాదు కానీ అలానే చావటం మాత్రం ఖచ్చితంగా నీ  తప్పే”

No comments: