Thursday, 5 November 2015

మొదటి క్రష్ 2

.నాలుగు రోజులుగా అదే తింటున్నాను. వాంతి చేసుకుంటున్నాను.
కానీ అదే తింటున్నాను ఎందుకంటే అది మాత్రమే నా బడ్జెట్ కి సరిపోతుంది.
పాండీ బజార్ లో ఉంది ఆ చిన్న హోటల్. ఒక బులుగు రంగు పిపాలో ఎక్కనుండి తెస్తారో గాని దానిలో పిండి లో అన్నీ రకాలు కలిసి ఉంటాయి. మినప పిండి, పెసర ఇంకా ఏవో నాకిప్పటికి తెలీదు. ఆ పిండి తో ఒక పెనం మీద పెద్ద దోసె పోస్తారు. దాని లోకి రుచి పచి లేని సాంబారు పోసి అంత పరిశుబ్రంగా ఉండని నల్ల రాయి టేబుల్ మీద అరిటి ఆకు లో వడ్డిస్తారు. తిను తినక పో 1-50 ధర.అది నా రాత్రి బోజనం.
**
ఉదయాన్నే నేను పని చేస్తున్న కన్స్ట్రక్షన్ కంపెనీ ఆఫీసు గదిలో పడుకున్న సోఫాని మడిచి, .
రూమంతా శుభ్రంగా తుడిచి ఆరున్నరకి రెడీ అయ్యేవాడిని.
ఆ పెద్ద బంగాళా గ్రౌండ్ ఫ్లోర్ లో ఆఫీసు పైన శ్రీనివాసా కన్స్ట్రక్షన్ కొంపెనీ అధినేత శ్రీ ఇడమకంటి కోటిరెడ్డి గారు(మా స్వగ్రామం తాళ్ళూరు వాస్తవ్యులు) ఉండేవారు.
టీ నగర్, హింది ప్రచార సభ రోడ్డులో లో సినీ నటి జయప్రద ఇంటి ముందు,
టి. రాజేందర్ (ప్రేమ సాగరం ఫేం) గారి ఇంటి పక్కన ఉండేది ఆ భవనం.
నా పక్కన రెండు కార్లు పట్టే జాగా అటు పక్క పనిమనిషి కం వాచ్మేన్ క్వార్టర్స్ ఉండేవి.
పైన ఉన్న మా బాస్ గాని వారి పిల్లలు గాని నిద్ర లేచేసరికి, నా బట్టలు ఉత్తుక్కోవటం వెనుక బాగాన చాటుగా ఆరవేసుకోవటం, స్నానం చేసి రెడీ అవటం అన్నీ అయిపోయేయి.
..
దగ్గర లోని టి కొట్లో, 0-30పైసల బన్నూ మరో ముప్పై పైసల టీ తో కడుపు నిండా ఉదయపు ఆహారం పూర్తి చేసుకునేవాడిని...
..
మద్రాస్ లో ఒక గమ్మత్తు వ్యవహారం నడిచేది. ..
బాగా ఖరీదయిన ఏరియాల చుట్టూ పక్కలే స్లమ్ ఏరియాలు ఉండేవి.
ఆలాటి చోట కొన్ని ప్రభుత్వ కాటిన్ లు నడుస్తుండేవి.(మధ్యాహ్నం మాత్రమే)
సహజంగా చెవిటి/మూగ పిల్లలు వాటిని నిర్వహిస్తుడే వారు.
ఒక సెంట్రలిజేడ్ పాయిట్ లో తయారయిన తైరు శాదం,సాంబారు శాదం etc (కొబ్బరి అన్నం , పెరుగు అన్నం, నిమ్మకాయ అన్నం, సాంబారు అన్నం మొదలయినవి)
సుమారు 150 గ్రాములు సైజులో పార్సిల్స్ వస్తుందేవి ఒక వాను లో. వాటిని ఈ బంకుల్లోని అమ్మాయిలు అమ్ము.తుండేేవారు.
''
నేను మరో ఇద్దరు రిటైర్డ్ వ్యక్తులు ఆ ఆఫీసులో పని చేసే వారం.
టెండర్ వెయ్యటానికి ఐటెమ్ రేటు వర్క్ ఔట్ చెయ్యటం నా పని,
బెంగళూరు, చెన్నై లోని వివిద చోట్ల కంపెనీ పనులు నడుస్తుండేయి .
అక్కడి పనుల తాలూకు బిల్లులు , ఖర్చులు , మెటీరియల్స్ పర్చేస్ లాటివి వీరు అజమాయిషీ చేస్తుండేవారు. టెక్నికల్ గా టెండర్లు కోట్ చేసేటప్పుడు పని కి అయ్యే యూనిట్ ఖర్చు వర్క్ ఔట్ చేయటం లో నేను మా బాస్ కి ఉడత సాయం చేస్తుందేవాడిని .
..
నేను మద్యాహ్నం బోజనం గా ఒక్కొక్కటి 1-50 ఖరీదు చేసే కొబ్బరి అన్నం /నిమ్మ అన్నం ,
మరొక పెరుగు అన్నం పొట్లం లు తెచ్చుకునే వాడిని. ఆవిదంగా నేను 3-00 లతో అంత మహా నగరం లో బోజనం చెయ్య గలిగె వాడిని.
..
ఆ అంగడి లో ఒక అమ్మాయి ఉండేది. మూగ అమ్మాయి. చామన చాయా లో ఉండేది. ..
చక్కటి పుటక. అందంగా నవ్వుతుండేది.
నేను కొద్దిగా లేటు గా వెళ్ళి నప్పుడు ఆ పాకెట్లు అయిపోవటం నా ముఖం లోని ఆందోళన ఆ పిల్ల గమనించింది.
కేవలం ఆ అమ్మాయి పేరు తెలుసు కోటానికి తమిళ అక్షరాలు నేర్చుకున్నాను.
ఒక సారి "ఉన్న పేరు ఎన్న?" అంటూ సైగ చేశాను
ఒక కాగితం మీద ఒక రీఫిల్ ముక్కతో కొన్ని అక్షరాలు రాసింది.
దానిని జాగర్తగా తెసుకెళ్లి జేమ్స్ బాండ్ లాగా డీ కోడ్ చేశాను.
" శాంతి "
మర్నాడు నేను వెళ్ళే సరికి పాకెట్లు అయిపోయాయి.
నిరాశగా వెనుతిరుగుతుంటే
నా కోసమే కౌంటర్ లో దాచిన రెండు పాకెట్లు ఇచ్చింది. నవ్వుతూ.
ఆమె నన్ను గుర్తు పెట్టుకున్నందుకు ఎంతో ఆనందం వేసింది.
" రొంబ నన్రి శాంతీ " చెప్పాను ఆమెతో.
..
ఆమె సమ్మోహనంగా నవ్వింది...
..
ఆమె నా మొదటి crush !!!!
---------------------- ఒక జ్ణాపకం.. (1986 ఫిబ్రవరి -ఏప్రియల్ మద్యకాలం ) లోంచి కొంత బాగం.

No comments: