Wednesday, 11 November 2015

హిందూ పేపర్ 13

బెంగుళూరు వెళ్ళే ముందు ప్రెగ్నెంట్ గా ఉన్న మా అక్క ని ఒక సారి చూడాలని పించింది. మా బాస్ వద్ద పెర్మిషన్ తీసుకుని ఒక శనివారం ట్రైన్ లో ఇంటికి వచ్చాను.
అక్క వాళ్ళు అప్పటికి సెటిల్ అవలేదు.  ఇద్దరు కొన్నాళ్లు ప్రైవేట్ స్కూల్ లో పనిచేసి తర్వాత మానేశారు, బావ గుంటూరు లో ఒక రేడియో షాపు లో పని చేస్తూండే వాడు. అక్క చిన్న పిల్లలకి ట్యూషన్  చెబుతుండేది. ఇద్దరు B.Sc ., B.Ed చదివినప్పటికి వారికి అప్పటికి పరిస్థితులు అనుకూలించలేదు.
అక్క కి 6 వ నెల నిండింది. అప్పటికే మనిషి భారంగా ఉంది. కాళ్ళు నీరు పట్టటం మొదలయ్యింది. కుటుంబం లో పరిస్థితులు అంత బాగా లేవు. ఏదో కొంత గ్యాప్ అక్కకి మా తల్లి తండ్రులకి మద్య  నడవటం నేను  గమనించాను. బావ నుండి ఎక్కువ ఆశించడం వల్ల అయి ఉండవచ్చు. ఏది ఏమయినా చిన్నవాడిని అవటం వల్ల పరిస్తితులు చక్కదిద్దలేక పోయాను కానీ అమ్మకి మాత్రం చెప్పాను.” అక్క ని అలా నిర్లక్షం చేయొద్దు. నాకు ఎందుకో ఇష్టం లేదు “ అని.
నేను తిరిగి మద్రాసు వచ్చే టప్పుడు  ఒక సాదారణ వ్యక్తి హిందూ పేపర్  కొనటం కనిపించింది.

ఉత్సుకత ఆపు కోలేక ఆయన్ని అడిగాను “ మీరు హిందూ చదువుతారా?”
ఆయన నా వైపు చూసి అర్ధ రూపాయకి దిండు లాగా పేపరు ఇస్తాడు. కూర్చున్నా చోట, పడుకున్న చోట, వదిలేసుకుంటూ వస్తాను. పార్కుల్లో కూర్చునేటప్పుడు వాడతాను, గాలి విసురు కుంటాను. రాత్రి తిరుగు ప్రయాణం దాకా బట్టలు పాడవకుండా ఉంటాయి “ అని చెప్పి లోపలున్న ఒక పేపరు ని బర్రున చింపి అశుబ్రంగా ఉన్న సీటు తుడిచి కాగితం కిటికీ లోంచి బయటకి వేసి కూర్చున్నాడు.
పేపరు వల్ల ఎంత ఉపయోగం అనిపించింది.
నేను మద్రాస్ కు వెళ్ళగానే మా బాస్ చెప్పారు ఎల్లుండి మా అబ్బాయితో కలిసి నువ్వు బెంగుళూరు  వెళ్తున్నావు అని. నేను సిద్దంగానే ఉన్నాను . ఇంటివద్ద అమ్మ ఉతికి పంపిన బట్టల సంచి, మరో బ్యాగు లో పుస్తకాలు  అవే నా లగేజీ
మొత్తం.  
మర్నాడు బెంగుళూరు లో రామయ్య ఇంగినీరింగ్ కాలేజీ లో చదువుతున్న బాస్ కుమారుడు శ్రీనివాస రెడ్డి కి కొత్తగా కొన్న ఇందు  సుజికి మోటార్ సైకిల్ తీసుకెళ్లి రైల్వే పార్సిల్ వేసి వచ్చాం. పెట్రోల్ శుబ్రంగా వంచేసి, గోనె పట్టాల పేకింగ్ చేయించాం .
మర్నాడు ఉదయం అక్కడ నుండి బయలు దేరే బృందావన్ ఎక్స్ ప్రెస్ కి చైర్ టిక్కెట్స్ రేజర్వ్ చేయించుకుని ఇంటి కి వచ్చాం.
తెల్లారి అయిదుకే రెడీ అయ్యి ఆటో లో  మద్రాస్ సెంట్రల్ కి వెళ్ళి సిద్దంగా ఉన్న బృందావన్ ఎక్స్ ప్రెస్ ఎక్కాం.

కొద్ది నిమిషాల తర్వాత సెంట్రల్ ఒదిలిన ఆ ట్రైన్ బెంగుళూరు వైపు పరిగెత్తసాగింది.
No comments: