Monday 2 November 2015

హెల్మెట్ వాడండి

ఉదయాన్నుంది బర్తని గమనిస్తూనే ఉంది కోమలి.
తన గదిలోనుండి తరచూ వంట గదిలోకి రావటం. నైటీ లో ఉన్న తనని పరీక్షగా చూడటం 
12 ఏండ్లనుండి సంసారంచేస్తుంది ఆ మాత్రం గ్రహించలేని దెమి కాదు.
త్వరగా పిల్లల్ని రెడీ చేసి ఆటో ఎక్కించింది. "మద్యాన్నం నేను లంచ్ తీసుకొస్తాను.".
స్కూల్ కి వెళ్తున్న పిల్లలతో చెప్పింది.
వంటగది కొద్దిగా సర్డింది. అంట్లు నడవాలో వేసింది.
గీజర్ కూడా వేసుకోకుండా అంత చలిలోను స్నానం చేసింది.
బొట్టు పెట్టుకుని రెండు నిమిషాలు పూజ చేసింది.
మైన్ డోర్ గడి ఉంచింది. ఫోన్ లు రెండు మ్యూట్ లో పెట్టింది.
లాండ్ లైన్ పోనే రెసీవర్ పక్కన ఉంచింది.
ఒక్కసారి అద్దం లో చూసుకుని బర్త ఉన్న రూములోకి వెళ్లింది.
అప్పటికే అతను స్నానం చేసి రెడీ అయి ఉన్నాడు.
" మాస్టారూ ..ఇప్పుడు చెప్పండి ఏమిటి విషయం ?" అంది.
***
"కోమలి .. పాకెట్ మని అయిపోయింది. ఒక్క రెండోదలు సర్దవా?"
మొహమాటంగా అడిగాడు.
***
ఆఫీసుకి వెళ్ళేటపుడు హెల్మెట్ పెట్టుకుని వెళ్ళటం మంచిదయింది.
బుగ్గ మీది గుర్తులు ఎవరు గమనించకుండా ..
హెల్మెట్ వాడండి .. ఎన్నో ఉపయోగాలు grin emoticon
‪#‎susri‬

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...