Thursday, 26 November 2015

మంచం విరిగింది. -30


చిటికినవేలు కన్నా తక్కువ పరిమాణం లో ఉండే డిటోనేటర్లు సన్నటి వైర్లు ద్వారా ఒక చోటకి కలిపి ఉంచి మరో బాటరీ సర్కుట్ కి కలిపి ఉంచుతారు. చాలా సినిమాల్లో చూపించినంత  ఘోరంగా , (సైకిల్ పంపు గట్టిగా కొట్టినట్లు ) ఉండదు బ్లాసింగ్ అంటే. చాలా సింపుల్ మన బెండకాయ స్విచ్ వేసినంత సింపుల్. కానీ దాని పరిణామం మాత్రం చాలా పెద్దది. పెద్దరాయి గుండె పగిలి బీటలు వారొచ్చు లేదా ధూఖం తన్నుకు వచ్చినట్లు పగిలిన ముక్కలు ఎంతో దూరం లో పడొచ్చు. బాగా నిపుణులు అలా ఎగిరి పడే రాళ్ళ నుండి కాపాడుకుంటూ బ్లాస్టింగ్ చేస్తారు.


అది తెల్లవారగట్లే . ఇంకా ఎవరూ దైనందికమ్ అందుకోకముందే. చుట్టూ కొలోమీటరు వరకు కర్రకు ఎర్రటి గుడ్డలు కట్టి హెచ్చరికలు జరుగుతాయి. ప్రత్యేకమయిన సైరన్ మొగుతుంది.
బ్లాస్టింగ్ చేసిన రాళ్లని ఒక ట్రెపీజాయిడల్ ఆకారం లో స్టాక్ చేస్తారు. అక్కడక్కడా వాటికి చార్జెస్ క్వాంటీటీ ప్రకారం క్లెయిమ్ చేస్తాం. తరువాత యూనిట్ 1010 పని సవ్యంగానే మొదలయింది. కింద దుడ్డు కంకర (పి‌సి‌సి 1:5:10) U ఆకారంలో స్టీల్ ఫెబృకేషన్ , ఐరన్ షట్టరింగ్, ఎం-20 కాంక్రీట్ (అప్పటికి డిజైన్ మిక్స్ లు రాలేదు) ,, ఎవరి పని వారు చేసుకుపోవటం, సజావుగానే సాగింది. ఒక వైపు పని ముందుకు సాగగానే వాలింగ్ ఆలస్యం  అయినప్పుడు ప్రీ కాస్ట్ మూతలు పని చేయించేవాడిని.
మా సుపర్వైజర్ నారాయణ  చెప్పినట్లు సవారి గొప్ప వర్కర్. అతను అతని భార్య (గర్భిణీ) మరో  చిన్న పిల్లాడిని తీసుకుని పనికి వచ్చేది సబ్ స్టేషన్ లోపల ఒక చీర కట్టి వాడిని లోపల ఉయ్యాలలో వాడిని వేసేది.
ఏ వర్కర్ లేకపోయినా , తక్కువ మంది హమాలీలు అటెండ్ అయినా సవారి ఉంటే చాలు నేను కాంక్రీట్ మొదలెట్టేవాడిని.
ఒకసారి తీరికగా ఉన్నప్పుడూ సవారి ఆహార్యం గురించి చిన్న ఆరా తీశాను.  సవారి కి  పెళ్ళయిన కొత్తల్లో ఒకసారి ఒక బిల్డింగ్ మీద నుండి పడి రెండు వారాలకి పైగా కోమాలో ఉన్నాడట, అనూహ్యంగా అతను తిరిగి కోలుకున్నప్పుడు అతని బార్య రెండు వైపు కుటుంబాలని తీసుకుని కొండకొచ్చి (తిరుమల) దంపతులం తలనీలాలు ఇస్తానని మొక్కు కుందిట. అప్పటి నుండి అంత డబ్బు పోగేయ్యటం వారి వల్ల కాలేదు కనీసం పాతిక మందితో తిరుమల వెళ్ళి రావటానికి అయిదారు వేలు ఖర్చు ఉంది. అందుకే అప్పుడప్పుడు బార్యని తిడుతుంటాడు. తీరని కోరిక కోరిందని. అతని జుట్టు ముడి కధ ఇది. అప్పటికే అతనికి ముగ్గురు సన్న బిడ్డలు మళ్ళీ ఆవిడ గర్భిణీ. ఆమె మీద కోపం ఈ విదంగా తీర్చుకుంటున్నాడు ?? :p
లాల్ జి తో నాకెప్పుడూ సమస్య రాలేదు ఒక్కే సారి వర్క్ పూర్తయాక నేను ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ల మీద సంతకం చేస్యించుకునే వాడిని. కొన్ని సార్లు బ్లాంక్స్ మీద కూడా సైన్ చేసేవారు.
ఎక్కడా తోచనప్పుడు లేదా రిఫ్రెస్ అవాలనుకున్నప్పుడు నాతో కలుస్తుండేవాడు. ఇద్దరం చక్కగా కన్వీనియెంట్ గా ఇష్టమయిన సబ్జెక్ట్ లు :p  మాట్లాడుకునే వారిమి. అతని దగ్గర ఒక గొప్ప డిసిప్లైన్ ఉండేది. నాకు బాగా నచ్చినది. ఏవిషయాన్ని అయినా జనరలైజ్ చేసి మాట్లాడేవాడు ఎవరిని ఉద్దేశించి గాని , చూపించి గాని అతను మాట్లాడటం నేను ఎరగను. మేమిద్దరం ఒక్కెసారి లంచ్ కి మా మెస్ కె వెళ్ళేవాళ్లం. ఒక మెకాన్ అధికారి మా మెస్ లో బోజనమ్ చేయటం అత్యంత అరుదు. వారికి కంపెనీ వాళ్ళే సిటీ నుండి పార్సిల్ తెప్పిస్తారు. అల్లుళ్ళలాగా చూసుకుంటారు.
చాలా సార్లు నా వేతనం గురించి మాట్లాడేవాడు, తక్కువ అని అంటుండేవాడు. కానీ నేనెప్పుడు అలా భావించలేదు బయటపడలేదు. 750/రూపాయల మిగులు  అన్నీ ఖర్చులో పోను అంటే అది నాకు .చా... లా. డబ్బు (big money)
యూనిట్ 1010 పని నల్లేరు మీద నడక అయ్యింది. మొదటి జీతం తీసుకునే సరికి దాదాపు 700 మీటర్లు స్కేలిటన్ పూర్తి చేశాను. కవరు లో ఉంచిన నెలజీతం అందుకుంటుంటే నా చేతులు వణికినట్లు అనిపించింది. పని చేసి గర్వంగా తీసుకుంటున్న డబ్బు అది. తరువాత ఆదివారం 24 గంటలు పనిచేసే GPO నుండి రూ..600 నాన్నకి MO చేశాను. ప్రపంచాన్ని జెయించిన అలెగ్జాండర్ లాగా అనిపించింది.
ఓ ఉదయం AO ఆదినారాయణ ని కలిసి నా మంచం విరిగి పోయింది. కొత్తది కావాలి సారి అని చెప్పాను”
ఆయన నా 48 కేజీల శరీరాన్నిజాగార్తగా  చూసి మంచం విరిగిందా ? దాన్ని ఏమి చేస్తున్నావు?” అని నవ్వాడు.


No comments: