Wednesday, 25 November 2015

సాంబారు –ఇడ్లీ -29

మర్నాడు ఉదయానికి నాకు కావల్సిన మెటీరల్స్, మిల్లరు , వర్కర్లు సిద్దంగా ఉన్నారు కానీ ట్రెంచ్ మాత్రం పూర్తి కాలేదు. మెత్తటి మట్టి మద్యలో పెద్ద పెద్ద కొండ రాళ్ళు పొడుకుకు వచ్చి ఉన్నాయి. ఈశ్వరమణీ తో మాట్లాడి కాంక్రీటు వర్క్ ఆపేసి బ్లాస్టింగ్ చేయాలని నిర్ణయించడం. వెంటనే కొంప్రెసర్ తీసుకొచ్చి వర్కర్స్ నేనిచ్చిన మార్కింగ్ ప్రకారం అడ్డం వచ్చిన రాళ్ళకి కంప్రెసర్ తో రెండు అడుగుల లోతుగా సన్నటి రెండు అంగుళాల వ్యాసంతో రంద్రాలు చెయ్యటం మొదలెట్టారు. మూడో రోజు ఉదయం బ్లాస్టింగ్ చెయ్యాలని అనుకున్నాం.


లాల్ జి తో నా ఇంటిమసి పసికట్టిన అడ్మినిస్ట్రేషన్ ఇంచార్జ్ ఆదినారాయణ మెకాన్ అప్రూవల్స్ కి నన్ను పంపేవారు. మొత్తానికి ప్రవేటు యంత్రాంగం కి ఎబిలిటీ తప్ప ఏ సర్టిఫికెట్స్ తో  పనిలేదని నాకు అర్ధం అయింది.
హిమాయత్ నగర్ లో ఉన్న మెకోన్ ఆఫీసుకి మాణీమరెన్ అనే AE నేను ఇద్దరం వెళ్ళాం.
మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వ్యక్తి మణిమారెన్ . చక్కటి ఇంగ్లీష్ మాట్లాడేవాడు అదీ చాలా ఈజ్ తో . లాల్ జి కి మేకన్ ఆఫీసు లో  మంచి గుర్తింపు ఉంది. నాగురించి పాసిటీవ్ గా చెప్పి ఉండటం వల్ల మా పని అక్కడ సులవు అయ్యింది. అక్కడి నుండి తిరిగి వస్తు నేను మాణీమరెన్ కలిసి టిఫిన్ చేయటానికి హోటల్ హర్ష కి వెళ్ళాం. ఒంటరిగా నేనెప్పుడు అలాటి చోటికి వెళ్లలేదు. స్టార్ హోటల్ ని తలపించే అక్కడ, కింద నున్న ఫ్లోరింగులో మా నీడలు కనిపిస్తున్నాయి. తను ఇడ్లీ సాంబారు ఆర్డర్ చేశాడు. నాకు అదే చెప్పి, నేను చూసిన  హైదరాబాదు లో ఇక్కడే నాకు సాంబార్ నచ్చేది అని చెప్పాడు. ఎంతయినా తమిళులు సాంబారు ప్రేమికులు.
నేను చుట్టూ ఉన్న పరిసరాలని గమనిస్తూ ఉన్నాను. ఖరీదయిన బట్టలు వేసుకున్న వారు, జడ వేసుకోటానికి సమయం లేని ఆడవారు, రకరకాల భాషలు , స్లాంగ్ లు, తమ ప్రపంచం తో తాము ..


బేరర్ తెచ్చిన స్పూన్ లతో అలవాటు లేని నేను తినటానికి ఇబ్బంది పడుతుంటే అతను నవ్వాడు. తన స్పూన్ లు రెండు పక్కన పెట్టి సాంబారు ఉన్న బౌల్ లో ఇడ్లీ ముక్కలు వేసి మెత్తగా నలుపుకుని తినటం మొదలెట్టాడు.
నేను విప్పరిన కళ్ళతో అతడిని చూశాను. “మేన్ వాట్ ఆర్ యు డుయింగ్ ? “ చిన్నగా అన్నాను. అతను అదేమీ విననట్టు బేరర్ ని పిలిసి పెద్ద బౌల్ లో సాంబారు తెమ్మని మర్యాదపూర్వకంగా చెప్పాడు. వచ్చాక దానిలో మిగిలిన ఇడ్లీ వేసుకుని తన స్టయిల్ లోనే ప్రశాంతంగా అక్కడ తనొక్కడే ఉన్నట్లుగా తిన్నాడు.
నేను చుట్టూ గమనిస్తూ ఉన్నాను. ఒరకంట మమ్మల్ని ఎవరో గమనించి నట్లుగా అనిపించింది. నేను కాలర్ లోకి తలని తాబేలు లాగా లాగేసుకున్నాను. ప్రపంచం మొత్తం మమ్మల్ని గమనిస్తున్నట్టు ఎగతాళి చేస్తునట్టు అనిపించింది.
టిప్ తో సహ బిల్ చెల్లించి అతను చెప్పసాగాడు. “నాకు అలా తింటేనే తిన్నట్టు ఉంటుంది.”
“డోంట్ సి స్టార్స్ (ఆశ్చర్యపడోద్దు) . దోస్ హూ లుక్ అట్ మీ డు నాట్ పె . మోర్ ఓవర్ ఐ ఈట్ ఫర్ మైసెల్ఫ్ . నాట్ ఫర్ అదర్స్ . వై షుడ్ ఐ కేర్ అదర్స్ లుక్స్ వెన్ ఐ స్టాండ్ ఆన్ మై ఓన్ ??”
నా వద్ద ఏ సమాదానము లేదు.
కానీ నాకొక జీవిత సత్యం బోదపడింది. జీవితం మనకి నచ్చినట్లు మనకోసం జీవించాలి. మరొకరి నచ్చేట్టు మనం ఎందుకు ఉండాలి ? మనం వారి కి నచ్చక పోవటం అనేది వాళ్ళ సమస్య. వాళ్ళ సమస్య కోసం  మనం ఎందుకు టైమ్ కేటాయించాలి . వారి గురించి ఎక్కువ ఆలోచించడం మన ఓటమి వారి గెలుపు. ఎక్కువ బాగం మనం ఓడిపోతునే ఉంటాం అనవసరంగా. మనం మన మనసు కి సమాదానం చెప్పుకుంటే చాలు . మనన్ని మనం చెక్ చేసుకుంటే చాలు.
థాంక్ యు మణిమారెన్ వేర్ ఎవర్ యు ఆర్ . :D


No comments: