Saturday, 21 November 2015

ఐ నీడ్ వన్ మోర్ హండ్రెడ్ --26


‘The best way of learning a language is to be with the people who speak it ‘ అని ఒక పుస్తకం లో చదివాను.
అక్కడ ఉన్న AE, JE లలో నేను కాకుండా మరో AE గారు మాత్రమే తెలుగువాళ్లం . వివాహితుడయిన ఆయన సమీపంలోని విలేజ్ లో ఉంటూ సైట్ కి వచ్చేవాడు. సఫారి డ్రస్ లేకుండా నేనెప్పుడూ అతన్ని చూడలేదు. మంచి వర్కర్ టంచనుగా ఉదయం 8-00 గంటల కి సైట్ లో ఉండేవాడు. యజమాన్యం అతనికి చాలా విలువ ఇవ్వటం రెండు మూడు రోజుల్లోనే నేను గమనించాను. 
మిగిలిన 19 మంది, తమిళ, కన్నడ, మలయాళీ సోదరులే.. సహజంగానే తమిళ్ తంబిలు లు హింది లో వీక్ అవ్వటం మూలాన మా అంధరి ఉమ్మడి భాష ఆంగ్లం అనబడే కచడా మాత్రమే..
ప్రధానంగా నారూమ్మెటు శినివాస్ చాలా మితభాషి, కన్నడిగుడు , కొంత సిరియగా ఉండే నైజాం. గ్రాడ్యుయేట్ ఇంజనీరు. చక్కటి ఇంగ్లీష్ మాట్లాడేవాడు. గదిలో ఉన్న నాలుగు హంగర్ లు తన బట్టల తోనే నిండి ఉండేవి . నేను ఒక పక్క గోడకి మేకులు ఏర్పాటు చేయిచ్చుకుని విడిచిన బట్టలు తగిలించుకునేవాడిని. 
**
కొత్త పెళ్లికూతురు అత్తారింట్లో తెల్లవారుజామునే లేసినట్లు నేను టంచనుంగా సర్వే ఇన్స్ట్రుమెంట్స్, డ్రాయింగులు తీసుకుని మేము పని మొదలు పెట్ట దలుచుకున్న చోటికి వెళ్ళాను. ఒక సుపర్వైజర్ సాయం తో. సైట్లో సుపర్వైజర్ లు అందరూ తెలుగు వారే. నేనంటే ఎంతో కొంత భాషాబిమానం ఉన్నట్లు నేను గమనించాను. నాకోసం ఒక రెగ్యులర్ హమాలిని మంచి వాడిని చూసి ఏర్పాటు చేస్తానని అతను నాతో చెప్పాడు. 
నేను బిబత్సంగా డ్రాయింగులు చూసి బెంచ్ మార్కు నుండి లెవెల్స్ బదిలీ చేసుకుని డ్రాయింగ్ ప్రకారం పోల్చి చేస్తే , కేబుల్ చానెల్ నెలలో -1.5mt కాకుండా గాలిలో +2.3 mt ఎత్తులో నిర్మించాల్సినట్టు గమనించాను. మధ్యానం దాకా ఎన్నిసార్లు చేసినా అదే రిజల్ట్ . చమట్లు పడుతున్నాయి . ఏదయినా పొరపాటు చేస్తున్ననేమో నాని ఒకటే టెన్షన్. కాలేజీ లో చదివే పుస్తకాలకి ఫీల్డ్ మీద ఎదురయ్యే అనుభవాలకి అసలు పొంతనే ఉండదు. 
మద్యాహ్నం అనుకున్న సమయానికి కొద్ది లేటుగా mecon జీబులో ‘లాల్ జి’ వచ్చారు.
తడిచిన నా చొక్కాని, రాళ్లలో , మట్టిలో తిరిగిన నా కాళ్లని గమనించాడు. “క్యా బాయ్? కైసే చల్ రహా హై “ అన్నాడు.
నేను గమనించిన విషయం చెప్పి డ్రాయింగ్స్ ప్రకారం అయితే UNIT 1010 ని భూమి లో కాకుండా 2 మీటర్ల ఎత్తులో గాల్లో కట్టాలి అని చెప్పాను.
ఆయన తను కూడా ఒకసారి లెవెల్స్ చూసి, ఇవన్నీ సాదారణమన్నట్లు. “ ఒక పని చేయండి. గ్రౌండ్ మీది యక్చువల్ లెవెల్స్ తీసి డ్రాయింగ్ మీద వాటిని రౌండ్ చేసి పెన్సిల్ తో వేయండి . SE గారి నుండి రాటిఫికేషన్ తీసుకుని పని మొదలెడదాం.“ అని చెప్పి వెళ్ళి పోయాడు. మరో నాలుగు రోజులు నాకు ఆరు కిలోమీటర్ల unit1010 సర్వే తో గడిచి పోయాయి. 
***
ఆదివారం ఉందయాన్నే మా కొలీగ్స్ కొందరు రెడీ అయ్యారు. సిటీ లోకి వెళ్తున్నామ్ నన్ను రమ్మన్నారు. నేను రావటం లేదు నలతగా ఉంది అని చెప్పాను. ‘మని మారెన్’ అని పక్క రూములో ఉండే AE వచ్చి జేబులో 100 రూపాయలు ఉంచి ‘ పే మీ ఫ్రమ్ యువర్ శాలరీ” అని నవ్వి ‘ మేక్ ఇట్ ఫాస్ట్. గెట్ రెడీ “ అని చెప్పాడు.
ఇక తప్పని స్థితిలో నేను తయారయ్యాను. కంపెనీ జీపు లో మమ్మల్ని చార్మినారు వద్ద దించారు. సాయంత్రం ఆరున్నరకి తిరిగి పిక్ అప్ కి రమ్మని చెప్పి అంధరం పోలో మని హైదరాబాదు లో పడ్డాం. సిటీ బస్ లో వెళ్ళి హోటల్ ఖంధారి లో చల్లటి ఏసీ గదిలో కూర్చుని బోజనమ్ చేశాం ఐస్క్రీమ్ తిన్నామ్. పోలో మని అర్ధకాని (నాకు) ఇంగ్లీష్ సినిమాకి వెళ్ళాం. మా మిత్రులు సినిమా మద్యలో నవ్వుతుంటే, అర్ధం కాలేదనుకుంటారని నవ్వే వారితో పాటు నేను నవ్వలేక పోయాను. అర్ధమయినంత వరకు అర్ధ చేసుకునే ప్రయత్నం చేశాను. లుంబిని పార్కు నుండి కొంత దూరం ఆడపిల్లల్ని చూసుకుంటూ నడిచామ్.
ఒక సన్న వీది లోకి వెళ్ళిన మా మిత్రులు ఒక పేపర్ బాగ్ లో కొన్ని సీసాలు తెచ్చుకోవటం గమనించాను. నాకు ప్రాణం లేచి వచ్చింది. మని మారెన్ ని ‘ ఐ నీడ్ ఒన్ మోర్ హండ్రెడ్ “ అడిగాను. అతను నన్ను వింతగా చూస్తూ జేబులో నుండి ‘మరో వంద’ తీసి నాకు ఇచ్చాడు.
#33grade

No comments: