Saturday, 21 November 2015

బూట్లు -25

ఉన్న ఎనిమిది రూముల్లో రూముకి సగటున  ముగ్గురం చొప్పున ఏ‌ఈ. జెఈ లు ఏడు రూముల్లోనూ , మరో రూములో సుపర్వైజర్లు నలుగురు ఉండేవాళ్ళం. దాదాపు మధ్యలో ఉండే మా రూములో మరో శ్రీనివాస్ అని కన్నడ ఏ‌ఈ ఉండేవారు. కేవలం మా రూములోనే ఒక పెద్ద బ్లాక్ & వైట్ టి‌వి ఉండేది ఒక చక్క టేబుల్ మీద. అందుకే మా రూం లో ఇద్దరమే ఉండేవాళ్లం. అప్పట్లో పొడవాటి  GI పైపు కి కట్టిన చాప ముల్లు లాటి  యాంటీనా &బుస్టర్ సాయం తో దురదర్శన్ డిల్లీ ప్రోగ్రామ్మెస్ వస్తుండేవి. ప్రతి రోజు రాత్రి 8-30 నుండి మంచి హింది సిరియల్స్ వస్తుందేవి. బూనియాద్ , బొంకేష్ బక్షి, తఃకీకత్ లాటివి వాటిని అందరూ మా రూములో కూర్చుని చేసేవాళ్లం.

యూనిట్ 1010 ఫైల్ (డ్రాయింగ్స్ కట్ట ) తీసుకోగానే, కాంప్ ఆఫీసులో మెకాన్ కన్సెల్టెంట్స్ కి కేటాయించిన రూములో కి వెళ్ళి అక్కడ వాకబు చేశాను. దర్మాకోల్ షీట్స్ తో ఫాల్ సీలింగ్ చేసి,లితోనియమ్ ప్లాస్టిక్ షీటు వేసి ఆ గదికి విండో ఏ‌సి బిగించి ఉండటాన్ని గమనించాను.
 Unit 1010 కి ఇంచార్జ్ ఎవరని.  ఆఫీసులో కూర్చుని ఉన్న ఆయన్ని అడిగాను.
ఓ జో దేఖ్తా హై ఓ రబీంద్ర నారాయణ్ లాల్ హై
“కైసే రహతా ?” (ఎలాటి వాడు?) కుతూహలంగా అడిగాను .
 “తోడా  గోరా రహతా దేఖ్నెకెలియే, మగర్ అచ్చాతో నహి
 (చూడటానికి ఎర్రగా ఉంటాడు కానీ మంచోడు కాదు ) “
“I am kept in charge of Unit 1010 from company side. I want to introduce myself  to him” చెప్పాను
“Oh . You are speaking a little better English. Go on talk to me. I am Rabindra Narayan laal “
నాకంటే ఆరేడు సంవత్సరాలు ఎక్కువ వయసులో ఉండే అతన్ని పరిక్షగా గమనించాను.
పరిచయాలయ్యాక నేను ఎక్కడి నుండి వచ్చాను, ఇదే  మొదటి ఉద్యోగమా లాటి పిచ్చాపాటి మాట్లాడుకున్నాం.
తాను పంజాబ్ యూనివర్సిటీ నుండి ఇంజనీరింగ్ గ్రాడ్యూయేట్ అని ఇంకా వివాహం కాలేదని , హిమాయత్ నగర్ లో మరో ఇద్దరితో కలిసి అపార్మెంట్ లో ఉంటున్నాని పెర్క్స్ అన్నీ మెకాన్ చూసుకుంటుందని చెప్పాడు.
నేను తనని లాల్ జీ అని తను నన్ను మిస్టర్ రావ్ అని పిలుచుకోవాలని ఒక ఒప్పడానికి వచ్చాం.
ఇంతలో కరుణాకరన్ అనే మరో  తమిళియన్   (JE) వచ్చాడు యూనిట్ 1212 ఇంచార్జ్ అని మాటలని బట్టి అర్ధమయ్యింది.
“ సర్ , ఐ పుట్ కాంక్రీట్ సార్. యు కం సర్. చెక్ సర్ “ అన్నాడు.
అతనికి హింది రాదు, లాల్ జీ కి అది తప్ప మరేమీ రాదు ఉన్న కామన్ భాష ఆంగ్లమే.
లాల్ జీ ఒక సారి బేలగా నన్ను చూశాడు.
If you did your concrete, what I am going to do ?” అన్నాడు .
“ నో సార్ . యు కం సర్ . లేబర్ వెయిటింగ్ సార్ . అల్ ఆర్ రెడీ సర్ , కాంక్రీట్ ఓవర్ సర్ “
లాల్ జి నన్ను బేలగా చూశాడు. నేను అర్ధం కానట్టు నవ్వు ఆపుకున్నాను.
this is the situation here. These people never mind the ‘tense’ in language”
సారి దిమాగ్ ఖా లేతా హై “ డస్క్ లోంచి జండూ బామ్ తీసి తలకి పట్టించాడు లాల్ జి.
“ ఆప్ జావో .. మై ఆతా హున్ “ చెప్పి పంపాడు.
ఒక సివిల్ ఇంజనీరుకి కమ్యూనికేషన్ ఎంత అవసరమో నా ప్రాక్టికల్ గా అర్ధం అయ్యింది.
మరో కొద్ది సేపట్లోనే మేం స్నేహితులమి అయి పోయాం . అదృష్ట వశాత్తు టెన్త్ ఇంటర్ కాలం లో మా హింది అయ్యవారు కారణంగా హింది ప్రచార సభ నుండి నేను పూర్తి చేసిన, ప్రాధమిక, మాధ్యమిక , రాష్ట్ర భాషా, విశారధ రెండు బాగాలతో హింది లో సౌకర్యంగాను, మద్రాస్ లో చదివిన బూతు పుస్తకాల కారణంగా ఇంగ్లిష్ లో కొంత మెరుగ్గాను ఉండటం నాకు ప్లస్ అయ్యింది.
“మొదట వర్క్ ని మైన్ పవర్ స్టేషన్ నుండి మొదలెడదాం , రేపు ఉదయం అన్నీ ఏర్పాట్లు చేసుకో .. మార్కింగ్ చేద్దాం ఒక అరకిలోమీటరు పొడవు అని చెప్పాడు. “
ఆయన వద్ద నుండి వచ్చి నేను ఆఫీసులో కూర్చుని డ్రాయింగ్స్ పరిశీలించడం మొదలెట్టాను . ఒక మెరుగయిన ఇంజనీరు మొదటి లక్షణం చేయాల్సిన పని పూర్తి అవగాహన చేసుకోవటం. ఒక్క , ఇటుక , లేదా, ఒక cft కాంక్రీట్ వృదా అంటే అది జాతికి నష్టం చేసినట్లే అని నాకు తొలి పాటం లాల్ జి చెప్పారు.
లంచ్ తర్వాత ఒక సుపర్వైజర్ సాయం తో సబ్ స్టేషన్ వద్దకి వెళ్ళి వర్క్ మొదలెట్టాల్సిన ఏరియాని చూసుకుని వచ్చాను. యర్త్ వర్క్ కి కావల్సిన మెన్ పవర్ గురించి నాకు అవసరమయ్యే రెగ్యులర్ హమాలీల గురించి మాట్లాడుకున్నాం. 
అక్కడ నాకు బాగా అవసరమయినవి నా వద్ద లేనివి “బూట్లు “

No comments: