Sunday 1 November 2015

మాట్లాడే కప్ప

ఒక కుర్ర వృద్ధుడు దురదృష్టవశాత్తూ బార్యని కొల్పాయాడు.
రెండు సార్లు అబార్షన్ చేయించి మరి ఇద్దరు 'మొగ' పిల్లల్నే కన్నాడు.
ఇద్దర్నే ఇరగదీసి చదివించాడు. ఒకరు కెనాడాలో మరొకరు LA లో ఉన్నారు.
ఈ మధ్యే భారీగా డాలర్ల పెళ్లి కూడా చేశాడు. అందరూ ఎటోల్లు అటు సర్దుకున్నాక
ఆయన్ని పల్లెటూర్లో పాత ఇంట్లో ఉంటే పిల్లలకి నామోషి అని పట్నం లో 2BK ఒకటి కొని కొడుకులిద్దరూ సమిష్టిగా అందులో ఉంచారు. 
ఒక రోజు ఆయన రోజు మాదిరిగా పార్క్ లో మార్నింగ్ వాక్ చేసి తిరిగి అపార్ట్మెంట్ మూడో అంతస్తుకి చేరుకుని తాళం తీసే సరికి మూల నున్న చెత్త బుట్ట నుండి ఒక గొండ్రు కప్ప
బయటకి దూకింది.
*****
"హాయ్" అంది ఆ కప్ప.
బిత్తర పోయిన ఈయన గోడకి ఆనుకుని మరి ఆశ్చర్యపోయాడు.
"భయపడకు.. నేను విఠలాచార్యా సినిమాలోని కప్ప మనమరాలిని. నాకు అనేక శక్తులు ఉన్నాయి. నువ్వు ఒంటరిగా ఉండటం చూసి వచ్చాను. నన్ను ఒక్క సారి ముద్దు పెట్టుకో . ఒక అందమయిన స్త్రీ గా మారి పోతాను. మనకు కావల్సినంత ఏకాంతం ఉంది కదా? జీవితాన్ని అనుభవిద్దువు గాని "
ఆయన భయపడటం మానేసి విషయాన్ని త్వరగా ఆకళింపు చేసు కున్నాడు.
ప్రశాంతంగా కూర్చుని ఆలోచించాడు. కప్పతో కొద్ది సేపు మాట్లాడాడు.
వంటింట్లోకి వెళ్ళి చిన్న వెదురు బుట్ట ఒకటి తెచ్చి దాన్ని అందులో ఉంచాడు.
కప్ప పెద్దగా అరిచింది. "ని కేమయినా చెముడా? నన్ను ముద్దు పెట్టుకో ?'
ఆయన దాని వైపే చూస్తూ "లేదు నాకిప్పుడు నాతో మాట్లాడేవారు కావాలి " అన్నాడు స్థిరంగా frown emoticon
‪#‎susri‬

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...