Friday 19 June 2015

సాయం.. అందుకోము :(

మంచి వర్షం లో 'కొండెపి' నుండి ఒక తెలిసీ తెలియని షార్ట్ కట్ రూట్లో 
ఒంగోలు బయలుదేరాము. నేను నా మిత్రుడు చెరో బండి మీద . 
చీకటి చిక్కబడుతుంది. 
రూటు చాలా కాలం క్రితం చూసిన గుర్తు. 
ఎదురుగా వచ్చే వాహనాల లైట్ వెలుగు నాలుగు కళ్లమీద 
పడి బండి నడపటం కష్టం గా ఉంది.
బయలు దేరిన రెండు కిలోమీటర్లు దాటాక నేను వేగంగా ముందుకి వచ్చాను.
మద్దులూరు దాటాక రోడ్డు మీద ఒక తను లిఫ్ట్ అడిగాడు.
చీకట్లో ఒంటరిగా వెల్లటమే కష్టం గా ఉంది ఆగకుండా వచ్చాను.
మరో అరగంట కి బాగా చీకటి పడింది.
నల్లటి తారు రోడ్డు,
సన్నగా ఎవరో అనుమతి కోసం చూస్తున్న వాన.
10 /12 కిలోమీటర్లు వచ్చాక ఆర్దమయింది.దారి తప్పానని.
గొడుగు వేసుకు వెళ్తున్నా ఒక బుడ్డోడిని అడిగా " ఏవూరు రా?"
"మా వూరే" అన్నాడు .
పల్లెటూర్లని కూడా త్రివిక్రమ్ వదల్లేదు.
మళ్ళీ అడిగితే ."ఇది వేములపాడు . అయిదు కిలోమీటర్లు
వెనక్కి వెళ్ళి చిలకపాడు నుండి సంతనూతలపాడు
మీదుగా ఒంగోలు వెళ్ళు" చెప్పాడు వాడు.
కట్ చేస్తే....
లాంగ్ రూటు కన్నా మరో పది కిలో మీటర్లు యెక్కువ ప్రయాణం చేసి ఒంగోలు వచ్చాను.
రాత్రి 8-30 దాటింది. బండి బాక్స్ లో జాగర్తగా ఉంచిన ఫోన్ బయటకు తీసి .
మిత్రుడికి ఫోన్ చేశాను.
" వచ్చి అరగంట అయింది. ఎవరో ఒకతను లిఫ్ట్ అడిగాడు .
అతను దోవ చూయించాడు
ఇప్పుడే ఫ్రెష్ అయి బోజనానికి కుర్చ్చున్నాను. "
smile emoticon grin emoticon

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...