Monday 18 May 2015

సర్వైశ్వర్య సిద్ది యంత్రము

హాస్పటల్ లో అర్ధో సర్జరీ చేయించుకున్న మిత్రుడిని పరామర్శించడానికి
బండి మీద నేను మరో మిత్రుడి తో కలిసి వెళుతున్నాను.
త్రోవలో తనకి కావాల్సిన లగేజి రెండు చేతుల్తో పట్టుకుని వెనుక మిత్రుడు
నాలుగు కొబ్బరి బోండాలు పార్సిల్ కట్టించుకుని
ముందు టాంకు మీద బాలన్స్ గా పెట్టు కుని నేను 
.
హటాత్తుగా వర్షం మొదలయ్యింది. ఊహించని వర్షం...
బొటని వ్రేలుకు గ్రిప్ లేని చెప్పుల్లాంటి షూ వర్షానికి తడిచి జారుతున్నాయి.
బట్టలు తడవటం మొదలయ్యింది. ఫాంటు జేబులో సెల్ ఫోను ఉంది.
కళ్ళజోడు మీద చుక్కలు ఇబ్బంది కలిగిస్తున్నాయి.
బ్రేక్ డ్రమ్స్ అరిగిన వెనుక బ్రేకులు, కేంద్ర ప్రభుత్వం లాగా పట్టీ పట్టనట్టుగా ఉన్నాయి.
మెయిన్ రోడ్డు కూడలి వద్ద రెడ్ లైట్ వెలిగింది.
కష్టం మీద బండి ఆపాను.
..
తిరిగి గ్రీన్ లైట్ వెలిగే సరికి బండి స్టార్ట్ చేశాను.
జేబులోంచి సెల్ ఫోన్ మోగింది.
ముందు టాంక్ మీద కొబ్బరి బోండాలు సరిగా కూర్చోక ఒకపక్కకి వరుగుతున్నాయి.
పోను రింగు తో పాటు .. వైబ్రేషన్ మొదలయ్యింది.
..
రోడ్డు దాటాక ఒక పక్క బండి ఆపుతుంటే .
వెనుక నుండి ఆటో ఒకటి వేగంగా రాంగ్ సైడ్ లో వచ్చింది.
కింద పెడుతున్న కాలు జారీ రోడ్డు వారగా మేమిద్దరం పడి పోయాం.
పోను సౌండ్ ఎక్కువయ్యింది. ఫోన్ తీశాను.
..
" మీరు అదృష్టవంతులు.. మీ నెంబరు మా లక్కీ డీప్ లో బహుమతి పొందింది.
సర్వైశ్వర్య సిద్ది యంత్రము, తాయెత్తు 3000 ఖరీదువి మీకు కేవలం 750 కే..."
అదృష్టాన్ని దులుపుకుని ఇద్దరం బండి లేపి నిలబెట్టాము.
ఆ పిల్లేవరోగాని మాదగ్గర కొస్తే 300 వందలకే 30 ఇస్తాం frown emoticon

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...