Monday 18 May 2015

వాడు


అస్తిపంజరం వళ్ళు , గుడ్లగూబ కళ్ళు,
ఆడదాని జుట్టు , టైటు ఫాంటు, మాచికల చొక్కా..
..
వాడో ఉష్ణ పక్షి , వాడో గుంట నక్క .
కాలేజీకి వెళ్ళే దారిలో కాపు వేస్తాడు 
వెనుకనే నడుస్తాడు ..ఏదేదో కూస్తాడు, 
అరుస్తాడు , ఇకిలిస్తాడు , సకిలిస్తాడు 
..
సాయంత్రం ట్యూషన్ కి వెలితే దారిలో సైకిల్ మీద అడ్డొస్తాడు ..
చేతులు వదిలి , కాళ్ళు వదిలి , రకరకాల విన్యాసాలు చేస్తాడు .
నవ్వుతాడు .. హీరో లా గెంతుతాడు,,తోక తెగిన జంతువులా గెంతుతాడు.
ఎపుడైనా వీది మలుపు కొట్లో కేలితే పనున్న వాడిలాగా వెనకే వస్తాడు.
అదెంత? ఇదెంత? అంటూ హంగామా చేస్తాడు..
నేను ఎంచుకున్న వస్తువునే బేరమాడతాడు .
డబ్బు అంటే లెక్కలేనట్టు .. ఇంట్లో బస్తాల కొద్ది కరెన్సీ మురిగిపోతున్నట్టు 
బ లా దూ రు గా మాట్లాడతాడు. 
సినిమా హాలులో వెనుక సీట్లో కూర్చుంటాడు .
తెరమీద దృశ్యాలకు తన బాషలో భాష్యం చెబుతుంటాడు ..
..
కాళ్ళ తో శరీరాన్ని తాకాలని చూస్తుంటాడు .
వంటిమీద పురుగుని వదిలినట్లు ,, ..
కారం డబ్బాలో బందింపబడినట్లు చిరాగ్గా ఉంటుంది.
కసిగా మంటగా ఉంటుంది...
..
పొద్దుటే కుళాయి వద్దకు నీళ్ళకు వెళుతుంటే దారిలో ఎదురై 
" నీకా శ్రమ ఎందుకు .. నేను సాయం చేయనా " అంటాడు .
గుండె వేగం పెరుగుతుంది .వడివడిగా నడుస్తాను .
మద్య మద్య తలతిప్పి బయం బయం గా చూస్తాను .
ఇంట్లో నాన్న కు చెప్పాలని ఉంటుంది. 
..
."నువ్వు మంచి దానివయితే వాడేం చేస్తాడు ?" అని కసురు కుంటాడు .
వాడు నా కళ్ళకి ఉరకుక్కలా కనిపిస్తాడు , సత్తువ కొద్దీ దూరంగా పారి పోవాలని పిస్తుంది. 
పుస్తకం తెరిచినా .. కళ్ళు మూసినా వాడే.. ఆ కుక్కే..
వాడి చూపులు మండే కుంపటి లా ఉంటాయి .
నా శరీరాన్ని గుచ్చుతుంటాయి .రోజు రోజుకి వాడు అసంపూర్తి పిడకలలా 
అరచేతి లో వ్రణం లాగా తయారయ్యాడు ..
గడప దాటి బయట పడాలంటే వాళ్ళు వణుకుతుంది.
....
వేసవి శెలవు లొచ్చాయి.
ఎంతో ఆనందం వేసింది. 
వీది వాకిలి దాటి బయటకి వెళ్ల నప్పటికి ఎంతో స్వేచ్చగా అనిపించింది.
వాడు కనిపించనడుకు ఆనందం వేసింది. 
చూస్తుండగానే శెలవులు అయిపోయాయి.నా ఆనందం కరిగి పోయింది. 
తిరిగి స్కూల్ మొదలయ్యింది. 
..
భయం భయం గా భీతి భీతిగా .
బలి కోసం ఎదురు చూసే జంతువులా బయటకొచ్చాను .
వీడి చివర కొచ్చాను . మార్కెట్ మలుపు తిరిగాను .
వాడి జాడ లేదు . ఆనవాలు లేదు . స్కూల్ కి వెళ్తుంటే మొదటి సారి ఆనందం వేసింది.
కాలేజీ వెనుక వైపు నుండి పగిలిన ప్రహరీ గోడ దాటి మైదానం గుండా నడవ సాగాను. 
దూరంగా స్కూల్ కనిపిస్తుంది .హమ్మయ్య వచ్చేశాను 
ఈ రోజుకి బతికి పోయాను అనుకున్నాను.
....
ఎక్కడి నుండి వచ్చాదో సైకిల్ వేగంగా తొక్కుకుంటూ రానే వచ్చాడు.
వచ్చి దారికి అడ్డంగా నిలబడ్డాడు. కసాయి లాగా నవ్వాడు.
"ఇన్నాళ్ళు నన్ను చూడకుండా ఎలా గడిపావు? నిజం చెప్పు" అన్నాడు 
నేను బేలగా చూశాను .
"ఒక్క సారి నాతో షికారుకి రారాదూ ? ఏటి గట్టు కేలదాము ?" అన్నాడు.
నా దోవకి చేతిని అడ్డుగా పెట్టి నుంచున్నాడు .
.గుండె మోకాల్లోకి జారింది.
..
నా పుస్తకాలు జారీ పడ్డాయి. కిందకు వంగాను .
అమ్మ కొనిచ్చిన కొత్త పారగాన్ చెప్పులు ..ఎడం కాలు చెప్పు తీసి 
ఒక్క ఉడ్డుటున లేచి చాచి కొట్టాను ..
అంతా దైర్యం ఎలా వచ్చిందో తెలీదు ..
అలా చేసింది నేనేనా అని ఆశ్చర్యం కూడా వేసింది. 
నేను తెరుకుని పుస్తకాలు సర్దుకుని చూసే సరికి వాడు అక్కడ లేడు .
.....
ఆరోజు సాయంత్రం ఎప్పటిలాగా వాడు ఎదురు పడలేదు ..
మర్నాడు ఉదయం కూడా.. మర్నాటి సాయంత్రం కూడా..
మూడో రోజు సాయంత్రం వీది మొదట్లో నన్ను చూసి పక్క సందులోకి 
తప్పుకోవటం గమనించాను.
మరెప్పుడు నా జోలికి రాలేదు వాడు.
..
నా కిపుడు ఒక సత్యం అర్ధమయింది.
"దైర్యం " -- ధైర్యాన్ని మించిన స్వేచ్చ మరోటి లేదు 
ఆ కొద్దిపాటి ధైర్యం చాలా కాలం క్రితమే చేసి ఉండాలనిపించింది.
...
(మార్చ్ 12 , 1989.. కోస్తావాణి , ఆదివారం అనుబందం... రాజమండ్రి )

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...